వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పదు ఇక, ఎమర్జెన్సీ విధించాల్సిందే , శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించనున్న అధ్యక్షుడు

|
Google Oneindia TeluguNews

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అందోళన, కుప్పలు తెప్పలుగా శవాలు, మరోవైపు నేడు కూడ పేలుతున్న బాంబులు, వరుస బాంబు పేలుళ్ల అనంతరం జరిగిన పరిణామాలతోపాటు ప్రస్థుత సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న శ్రీలంక ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నుండి దేశంలో ఎమర్జెన్సీవిధించబోతుంది. ఇందుకు సంబంధించి అధ్యక్షుని మీడియా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అధికారిక ప్రకటన చేయనున్నారు.

సోమవారం అర్థరాత్రి నుండి లంకలో ఎమర్జెన్సీ,

సోమవారం అర్థరాత్రి నుండి లంకలో ఎమర్జెన్సీ,

శ్రీలంక లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల అనంతరం జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న శ్రీలంక ప్రభుత్వం సోమవారం రాత్రి నుండి దేశంలో ఎమర్జెన్సీ విధించబోతుంది. ఇందుకు సంబంధించి అధ్యక్షుని మీడియా కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అధికారిక ప్రకటన చేయనున్నారు. అయితే ఎమర్జేన్సీ అనేది ఉగ్రవాదవాదాన్ని నియంత్రించే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నుండి దేశవ్యాప్తంగా ఎమర్జేన్సీని విధించినట్టు ప్రకటనలో పేర్కోన్నారు. దీని వల్ల ప్రజలు , వారి యొక్క వ్యక్తిగత స్వేఛ్చ మీద ఎలాంటీ ప్రభావం చూపదని తెలిపారు.

లంక మెయిన్ బస్టాండ్ లో 87 బాంబ్ డిటోనేటర్స్

లంక మెయిన్ బస్టాండ్ లో 87 బాంబ్ డిటోనేటర్స్

శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల అనంతరం తనిఖీలు చేపట్టిన అధికారులకు ప్రధాన బస్ స్టాండ్ అవరణలో 87 బాంబ్ డిటోనేటర్స్ కనుగోన్నారు. దీంతో శ్రీలంకలో హైటెన్షన్ వాతవరం నెలకొంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలోనే ఎమర్జెన్సీ సైతం విధించేందుకు సిద్దమవుతోంది. ఇక ఉగ్రదాడుల వెనక అంతర్జాతీయ హస్తం కూడ ఉండవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

పేలుళ్ల వెనక లంక తీవ్రవాదుల హస్తం ,

పేలుళ్ల వెనక లంక తీవ్రవాదుల హస్తం ,

లంకలో జరిగిన పేలుళ్ల వెనక ఎవరున్నారనే దానిపై శ్రీలంక ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. వీటివెనక స్థానిక ఉగ్రవాద సంస్థ నేషనల్ తౌవీత్ జమాత్ సంస్థ హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాగా బాంబు పేలుళ్లలో పాల్గోన్న ఆత్మహుతి సభ్యులందరూ శ్రీలంక చెందిన వారిగా అనుమానిస్తున్నామని ఆదేశ ఆరోగ్య శాఖ మంత్రి రజితా సేనరత్నే వెల్లడించారు. మైరోవైపు ఈ దాడులపై ఏప్రిల్ 4న అంతర్జాతీయ నిఘా సంస్థలు హెచ్చరించాయని ఆయన తెలిపారు.

English summary
Sri Lankan authorities have ordered a state of emergency to be introduced from midnight Monday following the deadly Easter attacks, the president’s office said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X