వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24*7: గజరాజుకు గార్డులు, రాజసం ఒలకబోస్తూ, ఠీవీగా రహదారుల్లో రాజులా నడక..

|
Google Oneindia TeluguNews

గజరాజు.. ఆ ఠీవి, రాజసం కనిపిస్తోంది. మావాటిల జీవనాధారం అయిన ఏనుగులను చూసి జనం బెంబేలెత్తిపోతుంటారు. చిన్నారులు అయితే సంబరపడిపోతుంటారు. ప్రధానంగా ఆలయాల వద్ద ఏనుగులు కనిపిస్తుంటాయి. అయితే పొరుగు దేశంలో అయితే ఏకంగా ఏనుగుకు సెక్యూరిటీ గార్డులను నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 ఏనుగు రాజులా..

ఏనుగు రాజులా..

నడుంబంగర రాజా.. 65 ఏళ్ల ఏనుగు. 3.2 మీటర్ల ఎత్తుతో ఠీవీగా ఉంటుంది. దీని యాజమాని ధర్మవిజయ, ఏనుగు ఆలానా పాలానా చూసుకుంటారు. అయితే 2015లో రాజాను ఓ వాహనదారుడు ఢీకొన్నాడు. ఆ ఘటన సీసీటీవీలో రికార్డయైంది. దీంతో ఏనుగు భద్రత కల్పిస్తామని శ్రీలంక ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో 24*7 గజరాజుకు భద్రత కల్పిస్తున్నారు.

 వేడుకలకు హాజరు..

వేడుకలకు హాజరు..

దేశంలో ఎక్కడైన పండుగ జరిగితే రాజా హాజరుకావాల్సిందే. తన అంగరక్షకులతో కలిసి రాజా వెళ్తుంది. సాధారణంగా రోడ్లు రద్దీగా ఉంటాయి అనీ.. సెక్యూరిటీతో వెళ్లడంతో ఇబ్బంది తప్పిందని రాజా యాజమాని చెప్తున్నారు. రాజా శ్రీలంక సంపద అని, కానీ అధికారికంగా ప్రభుత్వం మాత్రం గుర్తించలేదు. రాజా ప్రతిరోజు కొండలు, గుట్టలపై 90 కిలోమీటర్లు నడుస్తోంది. సాధారణ రోడ్లపై 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు నడుస్తోందని ధర్మవిజయ్ తెలిపారు.

ఈసాల వేడుకలో..

ఈసాల వేడుకలో..

మరోవైపు అధికార కార్యక్రమాల సమయంలో 100 ఏనుగులు కలిసి చేసే సాంప్రదాయ డ్యాన్సులలో కూడా రాజా మంచి నృత్యం చేస్తుందని ధర్మవిజయ్ తెలిపారు. డ్రమ్ములు వాయిస్తోండగా .. ఏనుగులు సుందరమైన నృత్యాలు కనువిందు చేస్తాయని చెప్తున్నారు. ఈసాల పండుగ సమయంలో ఏనుగుల విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లు చాలవని అంటున్నారు. కానీ జంతు ప్రేమికులు మాత్రం ఈ చర్యను తప్పుపడుతున్నారు. మరోవైపు మంగళవరం 70 ఏళ్ల ఏనుగు టిక్రీ చనిపోవడం విషాదం నింపింది. ఆ ఏనుగు ఈసాలా పండుగకు హాజరై వచ్చాకే మృత్యువాత పడిందని చెప్తున్నారు. ఇకపై పండుగల పేరుతో వాటిని చంపొద్దని కోరుతున్నారు.

English summary
Nadungamuwa Raja, 65 years old, the tallest tamed tusker in Sri Lanka. And he has his own armed guards. Raja's owner said the government has allocated troops to provide security for his pet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X