వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజపక్స: జాక్వెలిన్-సల్మాన్ ఖాన్ ఫెయిల్, తమిళనాట ఆనందం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొలంబో/చెన్నై: శ్రీలంక మాజీ అధ్యక్షులు మహింద రాజపక్సను ఎన్నికల్లో గట్టెక్కించడంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సఫలం కాలేదు! రాజపక్స తరఫున సల్మాన్ ఖాన్, మాజీ మిస్ శ్రీలంక యునివర్స్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌లు ప్రచారం చేశారు. రాజపక్సతో కలిసి వారు వేదికలు పంచుకున్నారు. రాజపక్స అమేజింగ్ మేన్ అంటూ సల్మాన్ ఖాన్ తన ప్రచారంలో కితాబిచ్చారు.

అయితే, సల్మాన్, జాక్వెలిన్‌ల ప్రచారం రాజపక్సకు అంతగా ఉపయోగపడలేదు. దీంతో, గ్లామర్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదంటున్నారు. తద్వారా గ్లామర్‌తో రాజకీయాలలో గట్టెక్కడం కుదరదనేది మరోసారి తేటతెల్లమైందంటున్నారు. రాజపక్సకు మద్దతు పలకడం ద్వారా సల్మాన్ ఖాన్ తమిళుల ఆగ్రహాన్ని చవిచూశారు. తమిళ పార్టీలు ఆయన పైన మండిపడ్డాయి. ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద తమిళులు ఇటీవల ఆందోళన కూడా చేశారు. ఇదిలా ఉండగా, ఓటమిని అంగీకరిస్తూ రాజపక్స నివాసాన్ని ఖాళీ చేశారు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

సల్మాన్, జాక్వెలిన్‌ల ప్రచారం రాజపక్సకు అంతగా ఉపయోగపడలేదు. దీంతో, గ్లామర్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదంటున్నారు. తద్వారా గ్లామర్‌తో రాజకీయాలలో గట్టెక్కడం కుదరదనేది మరోసారి తేటతెల్లమైందంటున్నారు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

రాజపక్సకు మద్దతు పలకడం ద్వారా సల్మాన్ ఖాన్ తమిళుల ఆగ్రహాన్ని చవిచూశారు. తమిళ పార్టీలు ఆయన పైన మండిపడ్డాయి. ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద తమిళులు ఇటీవల ఆందోళన కూడా చేశారు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

శ్రీలంక మాజీ అధ్యక్షులు మహింద రాజపక్సను ఎన్నికల్లో గట్టెక్కించడంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సఫలం కాలేదు!

సిరిసేన

సిరిసేన


శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మైత్రిపాల సిరిసేన విజయం సాధించారు. సిరిసేనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

రామదాస్

రామదాస్

తమిళులను చంపిన రాజపక్స శ్రీలంక ఎన్నికల్లో ఓడి పోవడం పైన రామదాస్ స్పందించారు. చట్టం ప్రకారం ఆయనను ప్రజలు శిక్షించారన్నారు.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మైత్రిపాల సిరిసేన విజయం సాధించారు. సిరిసేనకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. శ్రీలంకలో శాంతి, అభివృద్ధికి సహకరిస్తామన్నారు. మైత్రిపాలతో కలిసి పని చేసేందుకు సిద్ధమని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. మరోవైపు, రాజపక్స ఓటమి పైన తమిళ పార్టీలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తమిళ్ మానిల కాంగ్రెస్ లీడర్ బీఎస్ జ్ఞానదేశియన్ మాట్లాడుతూ.. శ్రీలంకలో తమిళులందరు కూడా రాజపక్సకు వ్యతిరేకంగా ఉన్నారని, కాబట్టి అతనికి గెలిచేందుకు కొద్ది అవకాశాలు మాత్రమే ఉండెనన్నారు. తమిళుల మద్దతు, ఓట్లతోనే సిరిసేన గెలిచారన్నారు. మైనార్టీగా ఉన్న తమిళుల పట్ల సిరిసేన ఉండాలన్నారు. ఫలితాలను కాంగ్రెస్ స్వాగతించింది. కొత్త ప్రభుత్వంలో మైనార్టీ అయిన తమిళులకు ప్రాధన్యత ఉండాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గోపన్న అన్నారు.

English summary
The loss of Mahinda Rajapaksa in the presidential election in Sri Lanka proved that Bollywood power has little influence when it comes to hard politics. Indian actor Salman Khan and former Miss Sri Lanka Universe and Bollywood actor Jacqueline Fernandes had campaigned for Rajapaksa ahead of the election and also shared the stage with the former Sri Lankan president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X