వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకలో బాంబు పెలుళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఐజీతో పాటు ఢిఫెన్స్ సెక్రటరీ అరెస్ట్..

|
Google Oneindia TeluguNews

శ్రీలంక బాంబు పేలుళ్లలో స్థానిక పోలీసుల హస్తం కూడ ఉందా...పోలీసుల నిర్లక్ష్యం వల్లే టెర్రరిస్టులు రెచ్చిపోయారా...అంత పెద్ద ఉన్మాదం జరుగుతుంటే పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు..ఉగ్రవాదుల దాడుల సమాచారం తెలిసినప్పటికి ఎందుకు మౌనంగా ఉన్నారు.. వీటన్నింటికి సమాధానం తెలుపుతూ శ్రీలంక ప్రభుత్వం ఏకంగా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను అరెస్ట్ చేసింది.

పోలీసు బాసులను అరెస్ట్ చేసిన శ్రీలంక

పోలీసు బాసులను అరెస్ట్ చేసిన శ్రీలంక

ఈస్టర్ సండే నాడు శ్రీలంకలో జరిగిన మారణహోమాన్ని నిరోధించలేకపోయిన పోలీసు బాసులను శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంత ప్రమాదం జరుగుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్వహహరించారని ఆరోపిస్తూ ఇన్స్‌పెక్టర్ జనరల్ పుజిత్ జయసుందర తోపాటు మాజీ ఢిఫెన్స్ సెక్రటరీ హేమ శ్రీ ఫెర్నాండోలను పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపించారు.

అటార్నీ జనరల్ ఆదేశాలతో అరెస్ట్,

అటార్నీ జనరల్ ఆదేశాలతో అరెస్ట్,

శ్రీలంక అటార్నీ జనరల్ దప్పుల డీ లీవైరా అదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు..అయితే అప్పటికే వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్న ఇద్దరు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా భద్రత హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో వారిని అరెస్ట్ చేసినట్టు అటార్నీ జనరల్ తెలిపాడు.కాగా నిర్లక్ష్యం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నేరమని ఆయన పేర్కోన్నారు.

అధ్యక్షుడు కూడ వైఫల్యం చెందారు...

అధ్యక్షుడు కూడ వైఫల్యం చెందారు...

కాగా జయసుందరతోపాటు హెమ శ్రీలు ఇద్దరు కూడ అంతకుముందు పార్లమెంటరీ విచారణ కమిటి ముందు ఆరోపణలపై విచారణకు హజరయ్యారు. అయితే అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భద్రతాపరమైన చర్యలను చేపట్టడంతో వైఫల్యం చెందారని వారు విచారణ సంధర్భంగా ఆరోపణ చేశారు..కాగా భద్రతా పరమైన చర్యలను చేపట్టడంలో వైఫల్యం చెందిన మరో తొమ్మిది మంది అధికారులను కూడ విచారణ చేపడుతున్నాట్టు అటార్నీ జనరల్ తెలిపారు. కాగా ఇస్టర్ సండెలో బాంబు పేలీ 258 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
Sri Lankan police arrested their top commander and a former defence chief Tuesday over their alleged failures to prevent the Easter Sunday bombings that killed 258 people, spokesman Ruwan Gunasekera said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X