వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి కేసులో ఆలస్యం ఏమిటి?: దుబాయ్‌లో అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబ్, గంటల్లోనే కేసు క్లోజ్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi Last Rites : Reasons Were Disclosed | Oneindia Telugu

దుబాయ్: దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయాన్ని మంగళవారం ఎంబామింగ్‌కు ఇచ్చారు. ఆ తర్వాత దర్యాఫ్తు పూర్తయిందని, శ్రీదేవి మృతి కేసులో ఎలాంటి అనుమానాలు లేవని, ప్రమాదవశాత్తూ ఇది జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.

శ్రీదేవి శనివారం రాత్రి చనిపోయినప్పటికీ దుబాయిలో అన్ని పూర్తయేసరికి మంగళవారం అయింది. అంటే రెండున్నర రోజులకు పైగా తీసుకుంది.దుబాయ్ పోలీసులకు అత్యాధునిక పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ అందుబాటులో ఉంది.

మృతిలో కొత్త కోణం, శ్రీదేవి కేసులో సంచలనం: తలపై తీవ్ర గాయాలు, ఎలా వచ్చాయి? మృతిలో కొత్త కోణం, శ్రీదేవి కేసులో సంచలనం: తలపై తీవ్ర గాయాలు, ఎలా వచ్చాయి?

అమెరికా వంటి దేశాల్లో

అమెరికా వంటి దేశాల్లో

అమెరికా వంటి అగ్రదేశాల్లో ఉండే ల్యాబ్‌కు తీసిపోని విధంగా దుబాయ్ ల్యాబ్ ఉంటుందట. అత్యాధునిక పరికరాలన్నీ ఉంటాయి. కచ్చితమైన, అగ్రశ్రేణి విచారణ జరుపుతుందన్న రికార్డు కూడా ఇక్కడ ఉంది.

కొన్ని గంటల్లో కేసు ఛేదన

కొన్ని గంటల్లో కేసు ఛేదన

కొన్ని కేసులను గంటల్లోనే చేధించిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వీధిలో ఈ అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ ఉంది. ఎలాంటి కష్టమైన కేసు అయినా పోలీసులు ఈ ల్యాబ్ సాయంతో ఛేదిస్తారట.

కచ్చితమైన నివేదికలు

కచ్చితమైన నివేదికలు

రసాయన, నార్కోటిక్ పరీక్షలు, నేరం జరిగిన ప్రాంతంలో ఆధారాల సేకరణకు పరికరాలు, వేలిముద్రలు, కంప్యూటర్ ఫోరెన్సిక్, డీఎన్ఏ టెస్ట్, ఆడియో, వీడియో పరిశీలన వంటి అన్ని రకాల టెస్టులు చేస్తారు. తక్కువ సమయంలో కచ్చితమైన నివేదికలు ఇస్తారనే రికార్డ్ ఉంది.

శ్రీదేవి మృతి విషయంలో

శ్రీదేవి మృతి విషయంలో

ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేస్తారు. శ్రీదేవి మృతి విషయంలో ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి పంపించారు. వాటిని పరిశీలిస్తారు. వీటి ఆధారంగా విచారణ ఉండాలా లేదా అనేది తేలుతుంది. అయితే, ఆమె ప్రముఖురాలు కావడం, పబ్లిక్ ప్రాసిక్యూషన్ తొలుత అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే శ్రీదేవి కేసు విషయంలో చాలా ఆలస్యం జరిగి ఉంటుందని అంటున్నారు.

తొలుత అభ్యంతరాలు

తొలుత అభ్యంతరాలు

ఇక్కడ శ్రీదేవి రిపోర్టును ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ తొలుత అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఆ తర్వాత కేసులో ఎలాంటి అనుమానాలు లేవని రూఢీ చేసుకుంది.

శ్రీదేవి మృతిపై అనుమానాలు

శ్రీదేవి మృతిపై అనుమానాలు

శ్రీదేవి బాత్ టబ్‌లో ప్రమాదశాత్తు మునిగి పడిపోయిన విషయం తెలిసిందే. ఆమె బాడీలో ఆల్కాహాల్ కూడా గుర్తించారు. దీంతో మద్యం మత్తులో పడిపోయారా, ఎవరైనా తోసేశారా, కుట్ర జరిగిందా, బాత్ టబ్‌లో పడితే చనిపోతారా అనే పెద్ద చర్చ సాగింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృతిపై అనుమానాలు లేవని, కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబై తరలించేందుకు మార్గం సుగమం అయింది.

 శ్రీదేవికి నివాళులు

శ్రీదేవికి నివాళులు

అయితే, శ్రీదేవి మృతిని దుబాయ్ పోలీసులు క్లోజ్ చేసినప్పటికీ.. బంధువులు మాత్రం తొలుత కార్డియాక్ అరెస్టుతో చనిపోయారని చెప్పడమే ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టని ప్రశ్నగా మిగిలింది. శ్రీదేవి భౌతికకాయం వద్ద బుధవారం సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించారు.

అనుమానాల్లేవు: శ్రీదేవి కేసు క్లోజ్, ఆ 'ఒక్క' ప్రశ్నకే దొరకని సమాధానం, ట్విస్ట్ మీద ట్విస్ట్! అనుమానాల్లేవు: శ్రీదేవి కేసు క్లోజ్, ఆ 'ఒక్క' ప్రశ్నకే దొరకని సమాధానం, ట్విస్ట్ మీద ట్విస్ట్!

English summary
Bollywood actor Sridevi died of accidental drowning in her hotel bathtub after losing consciousness, the Dubai government said today, giving a dramatic twist to her sudden death that has stunned legions of fans and industry colleagues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X