వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక అధ్యక్షుడిగా గోటబయ రాజపక్సే.. ప్రేమదాసపై ఘన విజయం

|
Google Oneindia TeluguNews

శ్రీలంక అధ్యక్సుడిగా గోలబయట రాజపక్సే విజయం సాధించారు. ప్రత్యర్థి సజిత్ ప్రేమదాసపై భారీ తేడాతో విక్టరీ కొట్టారు. 70 రాజపక్సే మాజీ అధ్యక్షుడు మహింద్ర రాజపక్సే సోదరుడు. మాజీ రక్షణశాఖ అధిపతిగా పనిచేసి మంచి పేరుతెచ్చుకున్నారు. పదవీ విరమణ తర్వాత అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించారు.

 మారిన పరిస్థితి..

మారిన పరిస్థితి..

శ్రీలంకలో ఈస్టర్ పేలుళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో భద్రత, కఠినచర్యలు, తదితర అంశాలతో గోటబయ ముందుకెళ్లారు. పదేళ్ల క్రితం అతని సోదరుడు మహేంద్ర రాజపక్సే శ్రీలంక అధ్యక్ష పదవీ చేపట్టారు. శ్రీలంక ద్వీపంలో 22 మంది మిలియన్ల ప్రజలు ఉన్నారు. ఇందులో మెజార్టీ ప్రజలు సింహాళ బౌద్దులు కావడం విశేషం.

పెరిగిన పోలింగ్

పెరిగిన పోలింగ్

శ్రీలంకలో 15.9 మిలియన్ల ఓటర్లు ఉన్నారు. 12 వేల 845 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 80 శాతం పోలింగ్ జరుగగా రాజపక్సేకు 50.7 శాతం ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థి సజిత్ ప్రేమదాస 43.8 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు.

నువ్వా.. నేనా..

నువ్వా.. నేనా..

అధ్యక్ష పదవీ కోసం 35 మంది పోటీపట్టారు. దీంతో ఎన్నికల అధికారులు 26 అంగుళాల బ్యాలెట్ పేపర్ రూపొందించారు. వీరిలో 70 ఏళ్ల గోటబాయ, 52 ఏళ్ల సజిత్ ప్రేమదాస మధ్య పోటీ నెలకొంది.

విశ్వసించలేదు

విశ్వసించలేదు

సజిత్ ప్రేమదాస ప్రస్తుతం గృహనిర్మాణ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అధికార పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఏప్రిల్‌లో జరిగిన మారణహోమం శ్రీలంకలో తీవ్ర ప్రభావం చూపింది. సజిత్ ప్రేమదాస ఓటమికి కూడా అదే కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఓడిపోయిన వెంటనే రాజపక్సేకు ప్రేమదాస అభినందనలు తెలిపారు.

కుదేలైన పర్యాటక రంగం

కుదేలైన పర్యాటక రంగం

దేశంలో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతంది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మాంద్యం ఉంది. దీనికితోడు ఉగ్రవాద దాడులతో పర్యాటక రంగం కుదేలైపోయింది. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితిని వివరించి.. రాజపక్సే ప్రజల అభిమానాన్ని పొందారు. ముఖ్యంగా బౌద్దులు రాజపక్సేకు మద్దతు తెలిపారని తెలుస్తోంది. పేదలను ఆకట్టుకునేందుకు చాలా పథకాలు తీసుకొచ్చామని ప్రేమదాస చెప్పిన ప్రజలు మాత్రం విశ్వసించలేదు. రాజపక్సే సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

మోడీ కంగ్రాట్స్

శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన గోటబయ రాజపక్సేకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. గోబటయ మీకు కంగ్రాట్స్, శాంతి స్థాపన కోసం, ఉగ్రవాదంపై పోరాడేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని మోడీ కోరారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు.

English summary
Sri Lanka’s former wartime defence chief Gotabaya Rajapaksa was set to become president after his main rival conceded defeat on Sunday in an election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X