వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బురఖా బ్యాన్ ! వరుస పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

కొలొంబో: గత ఆదివారం ఈస్టర్ పర్వదినం రోజున శ్రీలంక వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన శ్రీలంక ప్రభుత్వం భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి మహిళలు ఎవరూ బురఖా ధరించరాదని ఆదేశాలు జారీ చేసింది. బురఖా ధరించడంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బురఖాలు, ముఖంను కప్పుకోవడాన్ని నిషేధిస్తున్నామన్న నిర్ణయానికి శ్రీలంక అధ్యక్షుడు ఆమోద ముద్ర వేశారు.

Srilanka Govt bans burqas and face covers after the Easter blasts

ఇక శ్రీలంకలో బురఖాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం అర్థరాత్రి ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఒక వ్యక్తి ముఖాన్ని గుర్తుపట్టకుండా ధరించే ముసుగులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. దేశభద్రత దృష్ట్యా బురఖాలను నిషేధించాలని పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ మోషన్‌ను ప్రవేశ పెట్టారు. దీనికి సభ్యులు మద్దతు తెలపడంతో దీన్ని అధ్యక్షుడు సిరిసేన వద్దకు ఆమోదం కోసం పంపగా ఆయన ఆమోద ముద్ర వేశారు. ఇదిలా ఉంటే శ్రీలంకలోని భద్రతా బలగాలకు సహకరించాలని ముస్లిం మహిళలు బురఖాలు ధరించరాదని ఆదేశంలోని ముస్లిం మతపెద్దలు కూడా సూచించారు.

బురఖా ధరించడంపై నిషేధం విధించడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు. అయితే బాంబు దాడులు జరిగిన నాటినుంచి దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయని ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఈ నిషేధం విధించాల్సిన అవసరం తలెత్తిందని రణిల్ తెలిపారు. ఇక పేలుళ్ల ధాటికి 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 500 మందికి తీవ్రగాయాలయ్యాయి. దేశంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ... భద్రతాదళాలకు కొత్త నిబంధన కాస్త ఊరటనిస్తుందని ప్రభుత్వం భావించింది. ఇప్పటికే దేశంలో ముస్లింలు లక్ష్యంగా చాలా చోట్ల సామూహిక దాడులు జరిగినట్లు సమాచారం . చాలామంది ముస్లిం మహిళలు బురఖాలు ధరించడం మానేయగా.... వారి పిల్లలను కూడా బయటకు ఆడుకునేందుకు పంపడం లేదని సమాచారం.

English summary
Almost a week after a series of bomb blasts ripped through three Sri Lankan cities, government authorities on Sunday ordered a complete prohibition on all types of face covers including burqas.The decision to ban all types of burqas and face covers was approved by Sri Lankan President Maithripala Sirisena after several bombs ripped through the island nation on April 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X