వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో విమాన ప్రమాదమా?: కాంటాక్ట్ కోల్పోయిన ఇండోనేషియా బోయింగ్ విమానం

|
Google Oneindia TeluguNews

జకార్తా: ఇండోనేషియాకు చెందిన మరో విమానం ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. విమానాశ్రయం నుంచి ప్రయాణికులు, సిబ్బందితో టేకాఫ్ అయిన దేశీయ విమానానికి సంబంధించిన సిగ్నల్స్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

ఫ్లైట్ రాడర్ 24 కథనం ప్రకారం. శ్రీవిజయ ఎయిర్ ఫ్లైట్ ఎస్‍జే182 అనే దేశీయ విమానం మధ్యాహ్నం 2.37 గంటలకు ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి పొంటియనక్ అనే ప్రాంతానికి బయల్దేరింది. 95 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవాల్సిన ఈ విమానం కాంటాక్ట్ కోల్పోయింది.

SRIWIJAYA AIR FLIGHT SJ182: BOEING 737 LOSES CONTACT IN INDONESIA

చేరుకోవాల్సిన విమానాశ్రయానికి దగ్గరలోనే జావా సముద్రంపైనుంచి వెళుతున్న సమయంలో ఈ బోయింగ్ 737-500 విమానం కాంటాక్ట్ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

ఇండోనేషియా రవాణా శాఖ అధికార ప్రతినిధి అదిత ఐరావతి మాట్లాడుతూ.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. విమానాన్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలిపారు. బర్నాస్ అనే రెస్క్యూ ఏజెన్సీతో చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. విమానానికి సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

1994లో యూఎస్ ఈ విమానాన్ని ఇండోనేషియాకు అందజేసింది. 2012లో శ్రీవిజయ ఎయిర్ ఫ్లైట్‌లోకి వచ్చిందీ విమానం. శ్రీవిజయ ఎయిర్ అనేది చిన్న విమానయాన సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ కేవలం 9 విమానాలను మాత్రమే నడుపుతోంది. ఇవన్నీ లేటెస్ట్ మాక్స్ వేరియంట్ వర్షెన్ కంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు మోడల్ విమానాలు కావడం గమనార్హం.

2018 అక్టోబర్‌లో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జావా సముద్రంలో ఈ విమానం కూలిపోవడంతో 189 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

English summary
SRIWIJAYA AIR FLIGHT SJ182: BOEING 737 LOSES CONTACT IN INDONESIA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X