వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాక్ మీద షాక్: వారికి 10వేల ఉద్యోగాలిస్తామన్న సంస్థ

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ పైన షాక్ తగులుతోంది. ఏడు ముస్లీం దేశాల నుంచి రాకను ట్రంప్ అడ్డుకోబోగా, ఓ మహిళా జడ్జి దానిని నిలుపుదల చేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ పైన షాక్ తగులుతోంది. ఏడు ముస్లీం దేశాల నుంచి రాకను ట్రంప్ అడ్డుకోబోగా, ఓ మహిళా జడ్జి దానిని నిలుపుదల చేశారు. ఆ తర్వాత వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.

ఆ తర్వాత స్టార్ బక్స్ ఓ ప్రకటన చేసింది. సంస్థ ఛైర్మన్‌, సీఈవో హోవార్డ్‌ షూల్జ్‌ కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. వచ్చే అయిదేళ్లలో 10,000 శరణార్థులకు ఉపాధి కల్పిస్తానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కాఫీ స్టోర్లలో వీరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు.

<strong>ట్రంప్‌కే షాకిచ్చిన మహిళా జడ్జి, ఒబామా నియమించారు: ఎవరీమే..?</strong>ట్రంప్‌కే షాకిచ్చిన మహిళా జడ్జి, ఒబామా నియమించారు: ఎవరీమే..?

దీనిని అమెరికా నుంచే ప్రారంభిస్తామన్నారు. తాము అమెరికా సైన్యానికి ఎప్పుడూ మద్దతుగా ఉంటామని, ప్రస్తుతం మనకు ఎప్పుడో ప్రసాదించిన పౌరసత్వాలకు, మానవ హక్కులకు ముప్పు పొంచి ఉన్నట్లు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్నారు. మీరు వాటిని వినే ఉంటారని వ్యాఖ్యానించారు.

హిల్లరీకి మద్దతుగా నిలిచారు

హిల్లరీకి మద్దతుగా నిలిచారు

హోవార్డ్‌ షూల్జ్‌ అమెరికా ఎన్నికల సమయంలో హిల్లరీ క్లింటన్‌కు మద్దతు పలికారు. ఒబామా కేర్‌ రద్దు, శరణార్థులపై విధానం, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం విషయంలో ఆయన ట్రంప్‌తో విభేదించారు.

ట్రంప్ ఆదేశాల ప్రభావం..

ట్రంప్ ఆదేశాల ప్రభావం..

ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వుల ప్రభావం విమానయాన సంస్థల పైన కూడా పడుతోంది. ట్రంప్‌ జారీ చేసిన నిషేదాజ్ఞల ప్రభావం ఏడు దేశాల ప్రయాణికులతో పాటు ఆయా దేశాలకు చెందిన విమాన యాన సంస్థల సిబ్బందిపైనా పడుతోంది.

ఎమిరేట్స్ విమానయాన సంస్థ

ఎమిరేట్స్ విమానయాన సంస్థ

సిబ్బందికి కూడా అమెరికాలోకి ప్రవేశం నిలిపివేయడంతో ఎమిరేట్స్‌ విమానయాన సంస్థ అమెరికాకు వెళ్లే విమానాల్లో సిబ్బందిని, పైలట్లను మార్చేసినట్లు ప్రకటించింది. నిబంధనలకు తగినట్లుగా కావాల్సిన మార్పులు చేసినట్లు తెలిపింది.

ఎమిరేట్స్

ఎమిరేట్స్

తమ సంస్థలో విభిన్న ప్రాంతాలకు చెందిన సిబ్బంది చాలామంది ఉన్నందున చిన్న చిన్న మార్పులతో ఇబ్బంది తొలిగిపోయిందని పేర్కొంది. ఇప్పటి వరకు ఎమిరేట్స్‌ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని, శనివారం మాత్రం తమ ప్రయాణికుల్లో కొంతమందిపై ఈ నిషేధం ప్రభావం పడిందని పేర్కొంది. ముస్లిం మెజారిటీ దేశమైన యూఏఈలో దుబాయ్‌ ప్రభుత్వానికి చెందిన ఎమిరేట్స్‌ ఈ మేరకు ప్రకటన చేసింది.

English summary
Starbucks says it will hire 10000 refugees over the next 5 years in response to Trump's travel ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X