వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో స్వేచ్ఛ?: చీకట్లోకి వెళ్లిపోయిన స్టాచూ ఆఫ్ లిబర్టీ!

ఇది ఇలావుండగా, నేషనల్ పార్క్ సర్వీస్ సంస్థ ఇందుకు వివరణ ఇచ్చుకుంది. ఇలాంటి అనుభవం చాలా కొద్ది సేపేనని, కావాలని చేసింది కాదని చెప్పుకొచ్చింది. అనుకోకుండా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపింది.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్వేచ్ఛకు ప్రతీకగా నిల్చిన స్టాచూ ఆఫ్ లిబర్టీ చీకట్లోకి వెళ్లిపోయింది. రాత్రి పూట అక్కడ ఎలాంటి విద్యుత్ లైట్లు వెలగ లేదు. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ చిహ్నం అంధకారంలోకి వెళ్లిపోయిందని, స్వేచ్ఛకు చీకటి రోజులు వచ్చాయా? అంటూ నెటిజన్లు తమ అసంతృప్తిని సోషల్ మీడియాల్లో వెల్లగక్కారు.

Statue of Liberty goes dark, and Twitter lights up with conspiracy theories

ఎప్పుడూ లేనివిధంగా స్టాచూ ఆఫ్ లిబర్టీ వద్ద తొలిసారి విద్యుత్ లైట్లు ఆగిపోవడంతో ఆ స్వేచ్ఛ చిహ్నం అంధకారంలోకి వెళ్లిపోయింది. దాదాపు రాత్రిపూట కొన్ని గంటలపాటు ఆ విగ్రహం చీకట్లోనే ఉండిపోయింది.

చీకట్లో ఉన్న ఆ విగ్రహాన్ని ఓ ఎర్త్ క్యామ్ లైవ్ స్ట్రీమ్ చేసింది. దీంతో అసలు అక్కడ లైట్లు ఎలా ఆగిపోయాయి?, ఏం జరిగి ఉంటుంది? ఎందుకు స్వేచ్ఛా తల్లి చీకట్లో ఉండిపోయిందంటూ నెటిజన్లు తమ ప్రశ్నలను, అభిప్రాయాలను పంచుకున్నారు. 'మహిళా స్వేచ్ఛ నేడు చీకట్లోకి వెళ్లింది. స్టాచూ ఆఫ్ లిబర్టీ లైట్లు ఆగిపోయాయి. స్వేచ్ఛతో 200ఏళ్లపాటు సాగిన మనబంధం ముగిసింది. మహిళలు లేని రోజు వద్దని చీకట్లోకి వెళ్లిన స్టాచూ ఆఫ్ లిబర్టీకి ధన్యవాదాలు' అంటూ అనేకమంది నెటిజన్లు తమ భావాన్ని వ్యక్తీకరించారు.

ఇది ఇలావుండగా, నేషనల్ పార్క్ సర్వీస్ సంస్థ ఇందుకు వివరణ ఇచ్చుకుంది. ఇలాంటి అనుభవం చాలా కొద్ది సేపేనని, కావాలని చేసింది కాదని చెప్పుకొచ్చింది. అనుకోకుండా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. న్యూ ఎమర్జెన్సీ జనరేటర్ ప్రాజెక్ట్ వర్క్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని, కొద్ది సేపట్లోనే స్టాచూ ఆఫ్ లిబర్టీ వద్ద లైట్లు వెలిగిపోయాయని చెప్పుకొచ్చింది.

English summary
Images of a darkened Statue of Liberty triggered an outpouring of metaphors and a conspiracy theory or two across social media on Tuesday evening. That’s after the lights went out for a couple of hours on the colossal and most famous American statue, located in New York’s Harbor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X