• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భయపడినంతా జరుగుతోంది-ఆఫ్గన్ మహిళలపై తాలిబన్ సర్కార్ మరో పిడుగు-అణచివేతను మరింత తీవ్రం చేసేలా

|

ఆఫ్గన్ మహిళలు భయపడినంతా జరుగుతోంది... తాలిబన్లు ఒక్కొక్కటిగా మహిళా అణచివేత చర్యలకు పూనుకుంటున్నారు. నిన్నటికి నిన్న తాలిబన్లు కేవలం బాలుర పాఠశాలల రీఓపెనింగ్‌కు అనుమతినిచ్చి... బాలికలను విస్మరించారు.తాజాగా కాబూల్‌లో పనిచేసే మహిళా వర్కర్లు ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలిచ్చారు. పురుషులతో భర్తీ చేయలేని ఉద్యోగాల్లో ఉన్న మహిళలకు మాత్రమే పని చేసుకునేందుకు అనుమతినిచ్చారు. ఈ మేరకు కాబూల్ మేయర్ హందుల్లాహ్ నమోనీ ఆదివారం(సెప్టెంబర్ 19) ఒక ప్రకటన చేశారు.

తీవ్ర సంక్షోభంలో ఆఫ్గనిస్తాన్-ఆకలితో అలమటిస్తున్న జనం-తిండి కోసం అన్నీ అమ్మేసుకుంటున్నారుతీవ్ర సంక్షోభంలో ఆఫ్గనిస్తాన్-ఆకలితో అలమటిస్తున్న జనం-తిండి కోసం అన్నీ అమ్మేసుకుంటున్నారు

అణచివేతను తీవ్రం చేసేందుకేనా...

అణచివేతను తీవ్రం చేసేందుకేనా...


తాలిబన్ల తాజా ఆదేశాలు మహిళలపై మున్ముందు అణచివేత మరింత తీవ్రమవుతుందనే సంకేతాలు పంపించినట్లయింది.ఇప్పటికే బతుకుపై,భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనతో కాలం వెళ్లదీస్తున్న మహిళలపై తాలిబన్లు ఎప్పుడు ఏ ఆంక్షలు విధిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.తాజాగా కాబూల్ మేయర్ హందుల్లాహ్ మాట్లాడుతూ... కాబూల్ మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే మహిళలకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.అయితే ఈలోపు వారికి వేతనాలు అందుతాయన్నారు.

తాలిబన్ల ఆధీనంలోకి మహిళా మంత్రిత్వ శాఖ కార్యాలయం

తాలిబన్ల ఆధీనంలోకి మహిళా మంత్రిత్వ శాఖ కార్యాలయం

ఇదివరకు కాబూల్‌లో మహిళా మంత్రిత్వ శాఖ కార్యకలాపాలు నిర్వహించిన భవనంలో తాజాగా తాలిబన్లు ఇస్లామిక్ ధర్మ ప్రచారానికి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రపంచ బ్యాంకు సిబ్బందిని బలవంతంగా ఖాళీ చేయించారు. దీనిపై ఆ సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ... ప్రపంచ బ్యాంకు నిర్దేశించిన మహిళా సాధికారత,గ్రామీణాభివృద్ది కార్యక్రమంలో భాగంగా 100 మిలియన్ డాలర్లు వారి కోసం ఖర్చు చేసే ప్రాజెక్టులో తాము పనిచేస్తున్నామన్నారు.మహిళా మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నామని... తాజాగా తాలిబన్లు తమను అక్కడి నుంచి వెళ్లగొట్టారని తెలిపారు.

బయటపడుతోన్న అసలు స్వరూపం

బయటపడుతోన్న అసలు స్వరూపం


తాలిబన్లు ఆగస్టు 14న కాబూల్‌ను హస్తగతం చేసుకోవడంతో దేశం మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ మీట్‌లో తాలిబన్ల మాటలు కొంత ఉదారంగా కనిపించాయి. షరియా చట్టాలకు లోబడి మహిళలకు విద్య,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తాలిబన్లు ఆ సమయంలో చెప్పారు.అందరి రక్షణకు,భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని... ఆఫ్గన్ పునర్నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. దీంతో 1996 నాటి తాలిబన్ల పాలనకు,ఇప్పటి పాలనకు తేడా ఉండబోతుందేమోనని చాలామంది భావించారు.ముఖ్యంగా మహిళల పట్ల వారి వైఖరి మారిందని అనుకున్నారు. కానీ కొద్ది రోజులకే వారి అసలు స్వరూపం బయటపడింది.

ముందు నుంచి మహిళలే టార్గెట్...

ముందు నుంచి మహిళలే టార్గెట్...

ఆఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకోవడమే ఆలస్యం తాలిబన్లు మహిళలను టార్గెట్ చేశారు.మీడియా సంస్థలు,బ్యాంకుల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని బలవంతంగా ఇళ్లకు పంపించేశారు.మళ్లీ కార్యాలయాలకు రావొద్దని హెచ్చరించారు.కొన్నిచోట్ల ఇంటింటికి తిరుగుతూ 15 ఏళ్లు పైబడిన బాలికలను తమ వెంట రావాలని బలవంతం చేశారు.మాట వినని వారిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు.వెంట తీసుకెళ్లినవారిలో కొంతమందిని సెక్స్ బానిసలుగా మార్చుకున్నారు. ఇటీవల 33 మంది మంత్రులతో ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.దీనిపై పదుల సంఖ్యలో మహిళలు కాబూల్ వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. ఆ సమయంలో మహిళల నిరసనను కవర్ చేసిన కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేశారు.మరోవైపు మహిళల తిరుగుబాటును అణచివేసేందుకు మహిళలనే ప్రయోగించారు. కాబూల్‌లోని ఓ యూనివర్సిటీలో పదుల సంఖ్యలో మహిళలతో సమావేశం ఏర్పాటు చేయించి... నిరసన తెలియజేస్తున్న మహిళలు ఆఫ్గన్ మహిళా సమాజానికి ప్రతినిధులు కాదని... తాలిబన్ ప్రభుత్వానికి తాము మద్దతు తెలుపుతున్నామని స్టేట్‌మెంట్ ఇప్పించారు. అయితే తాలిబన్లు తమను చంపుతామని,యూనివర్సిటీల్లో చదవకుండా చేస్తామని బెదిరింపులకు గురిచేయడం వల్లే ఆ సమావేశానికి హాజరుకావాల్సి వచ్చిందని కొంతమంది మహిళలు వెల్లడించారు.

బాలికలకు విద్యను నిషేధిస్తారా?

బాలికలకు విద్యను నిషేధిస్తారా?

రెండు రోజుల క్రితం తాలిబన్ విద్యాశాఖ బాలుర స్కూళ్లు రీఓపెన్ చేయాలని ఆదేశాలిచ్చింది. ఆరు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలురు,పురుష టీచర్లు స్కూళ్లకు హాజరుకావాలని సూచించింది.అయితే బాలికల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. దీంతో గతంలో లాగే ఈసారి కూడా బాలికల విద్య పట్ల తాలిబన్లు నిషేధం విధిస్తారేమోననే ఆందోళన నెలకొంది. 1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో స్త్రీలకు విద్యపై నిషేధం విధించారు.బాలికలు చదువుకునే స్కూళ్లను మూసివేయించారు.మగ తోడు లేకుండా మహిళలు బయటకు రావొద్దని ఆంక్షలు పెట్టారు. అది కూడా కుటుంబ సభ్యుడితో కాకుండా పరాయి వ్యక్తితో బయట కనిపిస్తే దారుణ శిక్షలు విధించేవారు.అక్రమ సంబంధ ఆరోపణలు ఎదుర్కొనే స్త్రీలకు బహిరంగ శిక్షలు అమలయ్యేవి.వారిపై బహిరంగంగా గ్యాంగ్ రేప్ జరిపి హత్య చేయడం లేదా శిరచ్చేదనం వంటి దారుణమైన శిక్షలు విధించేవారు.

  Cricket Australia Warns Talibans.. మ‌హిళ‌ల‌ను ఆడనిస్తేనే మీతో సిరీస్ || Oneindia Telugu
  సంక్షోభం అంచున ఆఫ్గనిస్తాన్...

  సంక్షోభం అంచున ఆఫ్గనిస్తాన్...


  ఆఫ్గనిస్తాన్ ప్రస్తుతం సంక్షోభం అంచున ఉంది.ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయింది. దేశంలో 97శాతం ప్రజలు పేదరికంలో కొట్టుమిట్టుడుతున్నారు. తాలిబన్లు అధికారం చేపట్టాక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఫలితంగా ఉద్యోగ,ఉపాధి లేక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కొనేవారు లేక వ్యాపారులు మూతపడుతున్న పరిస్థితి. ఇళ్లల్లో వస్తువులను అమ్ముకుని ప్రజలు ఆ పూటకు తిండి సంపాదించుకుంటున్నారు. తాలిబన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే పరిస్థితి లేకపోవడంతో ప్రపంచ బ్యాంకు నుంచి సహాయం అందడం కష్టంగా మారింది. తమను ఆదుకోవాలని తాలిబన్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ... ఒక ఉగ్రవాద సంస్థ సారథ్యంలోని ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు సాయం చేయకపోవచ్చు.ఐక్యరాజ్య సమితి మాత్రం మానవతా దృక్పథంతో ఆఫ్గన్ ప్రజలను ఆదుకునే చర్యలకు ఉపక్రమిస్తోంది. మరోవైపు తాలిబన్ ప్రభుత్వంలో తాలిబన్లకు,హక్కనీ నెట్‌వర్క్‌కు మధ్య గొడవలు సమసిపోలేదు.దీంతో పూర్తి స్థాయి ప్రభుత్వ ఏర్పాటు ఇప్పట్లో జరిగేలా కనిపించట్లేదు. ప్రభుత్వంలో లుకలుకల కారణంగా ఆఫ్గన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం వారి వల్ల సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. మరోవైపు సంక్షోభం ముదిరితే దేశంలో సివిల్ వార్ తప్పకపోవచ్చుననే వాదన లేకపోలేదు.

  English summary
  All that Afghan women fear is happening ... the Taliban are one by one resorting to repressive measures against women. The day before yesterday, the Taliban had only allowed the reopening of boys' schools ... and ignored the girls.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X