ప్రేమించుకున్న అన్నాచెల్లెలు: తల్లిదండ్రుల హత్య
బ్యూనస్ఎయిర్స్: అర్జెంటీనాలోని బ్యూనస్ఎయిర్స్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సవితి తల్లుల సంతానమైన ఇద్దరు యువతీయువకులు ప్రేమించున్నారు. తమ ప్రేమను అంగీకరించకపోవడం, తమ తోబుట్టువులను సరిగా చూడటం లేదనే ఆరోపణలతో ఏకంగా వారి తల్లిదండ్రులనే హత్య చేశారు ఆ దుర్మార్గపు ప్రేమికులు.
వివరాల్లోకి వెళితే.. నిందితులు లియాండ్రో అకోస్టా(25), కరేన్ క్లెయిన్(22)లు ప్రేమికులుగా మారారు. వారి ప్రేమను అంగీకరించకపోవడం, తమ తోబుట్టువులను సరిగా చూడటం లేదనే ఆరోపణలతో వారి తల్లిదండ్రులు రికార్డో క్లెయిన్(54), మిర్యమ్ కౌల్జుక్(52)లను దారుణంగా హత్య చేశారు. ముక్కలుగా చేసి బూడిద చేశారు.

అకోస్టా తరపు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. తనను, తన 11ఏళ్ల తోబుట్టును తిట్టినందుకే హత్య చేసినట్లు అకోస్టా అంగీకరించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. నిందితులు క్లెయిన్ చంపిన తర్వాత ముక్కలుగా చేసిన కొంత భాగాన్ని తినేశారు.
తమ తల్లిదండ్రులను చంపేయడంతో తమకు శాంతి చేకూరిందని, తమను తిట్టేవాళ్లు ఇకలేరని నిందితులు చెబుతుండటం దిగ్ర్భాంతికి గురి చేసే అంశం. తమ తోబుట్టువుల కోసం తల్లిదండ్రులను చంపామని, ఇక నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు నిందితులు.
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు కారణంగానే నిందితులు ఈ హత్యలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని చెబుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.