వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పరిస్థితి వస్తే.. ఆత్మహత్య చేసుకుంటా: స్టీఫెన్ హాకింగ్

|
Google Oneindia TeluguNews

లండన్: తాను ప్రపంచానికి చేయగలిగింది ఇక ఏమీ లేనప్పుడు, చుట్టూ ఉన్నవాళ్లకు తాను భారమైనప్పుడు.. తీవ్ర మైన బాధ కలిగినప్పుడు తాను ఇతరుల సాయంతో ఆత్మహత్య(అసిస్టెడ్ సూసైడ్) చేసుకుంటానని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(73) చెప్పారు. ఒక వ్యక్తి అభిలాషకు వ్యతిరేకంగా అతడ్ని ప్రాణాలతోనే ఉంచడం అత్యంత అమర్యాదకరమని పేర్కొన్నారు.

ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ బతికే హక్కు ఉన్నట్లుగానే.. చనిపోయే హక్కు కూడా ఉండాలనేది స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం. ఇతరుల సాయంతో ఆత్మహత్యకు ఆయన ఇస్తున్న మద్దతు అంశంపై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా స్పందించారు. ఈ ఇంటర్వ్యూను జూన్ 15వ తేదీన బిబిసి వన్ ప్రసారం చేయనుంది.

ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఈ విధమైన ఆత్మహత్యను కోరుకుంటారని అడిగిన ప్రశ్నకు బదులు చెప్పారు. తాను అప్పుడప్పుడు ఒంటరితనానికి గురవుతున్నానని కూడా అందులో ఆయన చెప్పారు.

Stephen Hawking: 'I would consider assisted suicide'

తన పట్ల ప్రేమ, ఆరాధ్య భావంతో తనను చూసుకుంటున్నవారికి తాను భారమైతే చనిపోవడానికి సిద్ధమేనని చెబుతున్న హాకింగ్.. విశ్వ రహస్యాల గుట్టును పూర్తిగా ఛేదించకుండా చనిపోయే ఉద్దేశం లేదని కూడా తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ థియోరెటికల్ కాస్మాలజీలో ప్రస్తుతం పరిశోధక సంచాలకుడిగా పని చేస్తున్న హాకింగ్‌కు 21ఏళ్ల వయసులో ‘అమ్యోట్రాఫిక్ లాటెరల్ స్టెరోసిస్' వ్యాధి రావడంతో ఆయన అప్పట్నుంచి చక్కాల కుర్చీకే పరిమితమయ్యారు. వ్యాధి వచ్చిన ఏడాదికే చనిపోతారని డాక్టర్లు తేల్చినా.. మానసిక స్థైర్యంతో హాకింగ్ ఇంతకాలం జీవించే ఉన్నారు.

English summary
Stephen Hawking has said he would consider ending his own life if he became a burden to others or if he had “nothing more to contribute”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X