వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, ఆల్ రైట్స్ రిజర్వ్డ్: పేరు ట్రేడ్‌మార్క్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (73) తన పేరును ట్రేడ్‌మార్క్ చేసుకుంటున్నారు. తన పేరును ఎవరు కూడా ఇష్టారీతిగా ఉపయోగించకుండా, అలాగే చారిటబుల్ పర్పస్ కోసం ఆయన తన పేరును ట్రేడ్‌మార్క్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే జేకే రోలింగ్, డేవిడ్ బెక్‌హామ్‌లు తమ పేర్లను ట్రేడ్‌మార్క్ చేసుకున్నారు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఆ దారిలో నడుస్తున్నారు.

స్టీఫెన్ హాకింగ్ తన పేరును ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. హాకింగ్‌కు ముందే ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ బ్రియాన్ కాక్స్ కూడా పేరు నమోదు చేసుకున్నారు.

Stephen Hawking, all rights reserved

స్టీఫెన్ హాకింగ్ జీవితం ఆధారంగా 'ది థియరీ ఆఫ్ ఎవ్రీతింగ్' సినిమాను తీశారు. ఇది హాకింగ్ బయోపిక్. ఇందులో హాకింగ్ జీవితం, అతని అనారోగ్యం గురించి కూడా ఉంది. ఈ సినిమా పైన స్టీఫెన్ హాకింగ్ ప్రశంసలు కురిపించారు కూడా. ఈ నేపథ్యంలో తన పేరును ఎవరు ఇష్టారీతిగా వాడకుండా ఆయన ట్రేడ్‌మార్క్ చేసుకుంటున్నారు.

దీనిపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఇది స్టీఫెన్ హాకింగ్ వ్యక్తిగత విషయమని చెప్పారు. స్టీఫెన్ హాకింగ్ తన పేరును చారిటబుల్ పర్పస్ కోసం కూడా ట్రేడ్‌మార్క్ చేసుకున్నారు.

English summary
World-renowned British physicist Stephen Hawking, 73, is turning his name into trademark for charitable purposes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X