• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫేస్‌బుక్‌లో చేరిన ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్

By Srinivas
|

లండన్: ప్రముఖ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ సోషల్ మీడియాలో చేరారు. సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో ఆయన ఖాతా తెరిచారు. ఎల్లప్పుడు ఆసక్తిగా ఉండండి అంటూ ఆయన తన ఫేస్‌బుక్ పేజీలో తొలి పోస్ట్ చేశారు. ఆయన చేరిన రోజుల్లోనే పది లక్షల మందికి పైగా నెటిజన్లు ఆయనను అనుసరిస్తున్నారు. ఆయన ఫేస్‌బుక్ పేజీలకు లైకులు వెల్లువెత్తుతున్నాయి. అవి కొనసాగుతున్నాయి కూడా.

స్టీఫెన్ హాకింగ్ యునైటెడ్ కింగ్ డమ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో 1942 జనవరి 8న జన్మించారు. ఇతని వయస్సు ప్రస్తుతం 72 ఏళ్లు. ఇతను ప్రసిద్ధ శాస్త్రవేత్త. తన ప్రయోగాలతో ఆయన ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నారు. కాగా, సామాజిక అనుసంధాన వేదికల్లో సినీ తారలకే కాదు, సైంటిస్టులకు కూడా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారని స్టీఫెన్ హాకింగ్స్ నిరూపించారు.

ఇటీవల ఆయన గాడ్ పార్టికల్స్ (దైవ కణాల) హైన హెచ్చరించారు. దేవుని కణానికి ఈ ప్రపంచాన్ని నాశనం చేసే సామర్ద్యం ఉందని ఆయన ఇటీవల చెప్పారు. అధిక శక్తి స్దాయిల ఉండటం వల్ల అది అస్దిరంగా మారి ఒక "విపత్తు వాక్యూమ్ క్షయం" దారితీస్తుందని అన్నారు.

stephen hawking starts posting on facebook

తన కొత్త పుస్తకం స్టార్‌‌మస్ ముందుమాటగా మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హిగ్స్ సంభావ్య 100bnగిగా ఎలక్ట్రాన్ వోల్ట్ల వద్ద స్దిరం అవుతుండటం చింతింతాల్సి ఉంటుందని అన్నారు. ఈ వినాశనం రాబోయే కాలంలో సంభవిస్తుందని జోస్యం చెప్పారు. ఐతే అధిక శక్తి వద్ద హిగ్స్ విస్మరించబడతాయని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు.

CERNలో 2012వ సంవత్సరంలో హిగ్స్ బోసన్‌ని కనుగొన్నారు. ప్రపంచంలో అతి పెద్ద కణ భౌతిక ప్రయోగశాలలో పనిచేసేవారు దీనిని కనుగొన్నారు. గత 30 సంవత్సరాలుగా కేంబ్రిడ్జి యూనివర్సిటీకి తన సేవలను అందిస్తున్న స్టీఫెన్ హాకింగ్ ఇటీవలే ఓ కొత్త పుస్తకాన్ని ప్రచురించారు. దాని పేరు 'గ్రాండ్ డిజైన్'.

హాకింగ్ ఇటీవలే స్పేస్ విమానంలో ట్రావెల్ సున్నా-గురుత్వాకర్షణను ఎలా ఫీల్ అవుతాడో అలాంటి మొదటి అనుభవాన్ని స్పెషల్ విమానంలో ప్రయాణం చేసి అనుభూతిని పొందారు. యూరప్‌లోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ ‘కాస్మోస్'ను ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఆవిష్కరించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘న్యూమరికల్ కస్మాలజీ-2012' శిక్షణా సదస్సులో ఈ కంప్యూటర్‌ను ఆవిష్కరించారు.

ఈ శక్తివంతమైన సూపర్ కంప్యూటర్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు, పదార్థ నిర్మాణ శాస్త్రవేత్తలు, ఇతర విద్యావేత్తలు ఉమ్మడిగా పంచుకునే అవకాశముంది. విశ్వ రహస్యాల చేధనలో భాగంగా మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు కాస్మోస్ లాంటి సూపర్ కంప్యూటర్ల ఉపయోగపడతాయని హాకింగ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

English summary
We have no idea about if there’s an intelligent life out there in the universe. But we can at least confirm that there’s a little intelligent life on Facebook, seeing that Stephen Hawking, the world’s best known theoretical physicist, began posting there yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X