వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వం నాశనం, దేవుడి కణానికి ఆ శక్తి: స్టీఫెన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: స్టీఫెన్ హాకింగ్ దేవుని కణానికి ఈ ప్రపంచాన్ని నాశనం చేసే సామర్ద్యం ఉందని హెచ్చరించాడు. 72ఏళ్ల ఈ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త మాట్లాడుతూ అధిక శక్తి స్దాయిల ఉండటం వల్ల అది అస్దిరంగా మారి ఒక "విపత్తు వాక్యూమ్ క్షయం" దారితీస్తుందని అన్నారు. తన కొత్త పుస్తకం స్టార్‌‌మస్ ముందుమాటగా మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

హిగ్స్ సంభావ్య 100bnగిగా ఎలక్ట్రాన్ వోల్ట్ల వద్ద స్దిరం అవుతుండటం చింతింతాల్సి ఉంటుందని అన్నారు. ఈ వినాశనం రాబోయే కాలంలో సంభవిస్తుందని జోస్యం చెప్పారు. ఐతే అధిక శక్తి వద్ద హిగ్స్ విస్మరించబడతాయని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. CERNలో 2012వ సంవత్సరంలో హిగ్స్ బోసన్‌ని కనుగొన్నారు. ప్రపంచంలో అతి పెద్ద కణ భౌతిక ప్రయోగశాలలో పనిచేసేవారు దీనిని కనుగొన్నారు.

Stephen Hawking warns God particle has potential to 'end world'

గత 30 సంవత్సరాలుగా కేంబ్రిడ్జి యూనివర్సిటీకి తన సేవలను అందిస్తున్న స్టీఫెన్ హాకింగ్ ఇటీవలే ఓ కొత్త పుస్తకాన్ని ప్రచురించారు. దాని పేరు 'గ్రాండ్ డిజైన్'. హాకింగ్ ఇటీవలే స్పేస్ విమానంలో ట్రావెల్ సున్నా-గురుత్వాకర్షణను ఎలా ఫీల్ అవుతాడో అలాంటి మొదటి అనుభవాన్ని స్పెషల్ విమానంలో ప్రయాణం చేసి అనుభూతిని పొందారు.

యూరప్‌లోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ ‘కాస్మోస్'ను ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఆవిష్కరించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘న్యూమరికల్ కస్మాలజీ-2012' శిక్షణా సదస్సులో ఈ కంప్యూటర్‌ను ఆవిష్కరించారు.

ఈ శక్తివంతమైన సూపర్ కంప్యూటర్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు, పదార్థ నిర్మాణ శాస్త్రవేత్తలు, ఇతర విద్యావేత్తలు ఉమ్మడిగా పంచుకునే అవకాశముంది. విశ్వ రహస్యాల చేధనలో భాగంగా మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు కాస్మోస్ లాంటి సూపర్ కంప్యూటర్ల ఉపయోగపడతాయని హాకింగ్ తన అభిప్రాయాన్ని తెలిపారు.

English summary

 Stephen Hawking has recently warned that the God particle or Higgs boson has the potential to obliterate the universe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X