వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేరే గ్రహాలకి వెళ్లకుంటే మానవజాతికి ప్రమాదం:హాకింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: శాస్త్రసాంకేతిక రంగాల్లో పెద్ద ఎత్తున పురోగతి మానవుడి స్వీయ వినాశనానికి దారితీసే ప్రమాదం ఉందని భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ హెచ్చరించారు. అందువల్ల భూమి నుంచి ఇతర గ్రహాలకు వలస వెళ్లకపోతే మానవజాతి తుడిచి పెట్టుకుపోయే ప్రమాదముందన్నారు.

అయితే అంతరిక్ష కాలనీలు ఇంకా సుదూర కలగానే ఉన్నాయన్నారు. పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన అంతరిక్ష ఆవాసాలను దాదాపు మరో వందేళ్ల వరకు ఏర్పాటు చేసుకోలేమని, ఈ లోగా మనం జాగ్రత్తగా ఉండాల్సిందేని వ్యాఖ్యానించారు.

అణు యుద్ధం, భూతాపం, జన్యుమార్పిడి చేసిన వైరస్‌ల వల్ల ముప్పు పొంచి ఉందని స్టీఫెన్ హాకింగ్ అన్నారు. ప్రస్తుతానికి భూమికి హాని జరిగే అవకాశం తక్కువే అయినా కాలక్రమేణా ఆ అవకాశం పెరుగుతుందని, వచ్చే వెయ్యి నుంచి పదివేల సంవత్సరాల్లో అది దాదాపు ఖాయంగా జరిగే అవకాశముందన్నారు.

Stephen Hawking warns of mankind wiping itself out

వైరస్‌లు, కృత్రిమ మేధస్సు, భూతాపం వంటి అంశాల్లో మానవులు పెను ప్రమాదాలను సృష్టిస్తున్నారని, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు శక్తిమంతంగా తయారై మానవులనే కబళించవచ్చని స్టీఫెన్ హాకింగ్ అంటున్నారు.

పురోగతిని ఆపలేమని, వెనక్కి కూడా వెళ్లలేమని, అందువల్ల ప్రమాదాలను గుర్తించి, వాటిని కట్టడి చేసే మార్గాలను ఆలోచించాలని, నేను ఆశావాదినని, వీటిని కట్టడి చేయగలమని విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం పురోగతి ఏ దిశగా సాగుతోందో ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

English summary
Physicist Stephen Hawking has said the chances of cataclysmic events which could affect the survival of humanity are soaring, and we have only ourselves to blame.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X