వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ ఖాతాదారుల డేటా విక్రయం: స్టీవ్ బన్నోన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఫేస్‌బుక్ తన ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెడుతోందని వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బన్నోన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారం లీకైందని చర్చ సాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు మరింత కలకలం రేపుతున్నాయి

గురువారం నాడు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికకు వైట్‌హౌజ్ మాజీ అధికారి స్టీవ్ బన్నోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫేస్‌బుక్ ఖాతాదారుల డేటాను విక్రయిస్తోందని ఆయన చెప్పారు. అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇది జరిగిందన్నారు. ఫేస్‌బుక్ షేర్ల విలువ పెరగడానికి, ఆ కంపెనీ వ్యాపారం పెరగడానికి కారణమదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Steve Bannon on Cambridge Analytica: Facebook data is for sale all over the world

రాజకీయ సంబంధిత డేటా చోరీ విషయమై మాత్రం తనకు స్పష్టత లేదన్నారు. కేంబ్రిడ్జి ఎనలైటికాకు యూఎస్ ఓటర్ల డేటాను అమ్ముకొందన్న ఆరోపణలను గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఖండించారు..

కేంబ్రిడ్జ్ ఎనలైటికా మాతృ, సంస్థ ఎస్‌సీఎల్ సుమారు 50 మిలియన్ల ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహరంలో బన్నోన్ హస్తం కూడ ఉందని కూడ ఆరోపణలొచ్చాయి.

English summary
Steve Bannon tried to distance himself from the Cambridge Analytica scandal on Thursday, claiming: “I didn’t even know anything about the Facebook mining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X