వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టిక్కర్ ఉంటే చాలు... వైర్ లేకుండానే మొబైల్ చార్జింగ్

ఎనర్జీ స్క్వేర్ అనే ఫ్రెంచ్ స్టార్టప్ ఒక కొత్త జనరేషన్ వైర్ లెస్ చార్జర్ ను అభివృద్ధి పరిచింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇకమీదట వైర్ లేకుండానే మీ మొబైల్ ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఎనర్జీ స్క్వేర్ అనే ఫ్రెంచ్ స్టార్టప్ ఒక కొత్త జనరేషన్ వైర్ లెస్ చార్జర్ ను అభివృద్ధి పరిచింది. ఈ కంపెనీ తయారు చేసిన అల్ట్రా థిన్ స్టిక్కర్లతో ఏకకాలంలో మీ మొబైల్స్ ను చార్జ్ చేసుకోవచ్చు.

దీనికోసం చార్జింగ్ ప్యాడ్, స్టిక్కర్ తో కూడిన ఈ టూ-పార్టీ సిస్టం ను మీ మొబైల్ వెనుక అమర్చుకోవలసి ఉంటుంది. ఈ స్టిక్కర్ మీద రెండు చిన్నన లోహపు దాట్స్ ఉంటాయి. దీంతోపాటు కనెక్టర్ కూడా ఉంటుంది.

Sticker Is Enough... Charge Your Mobile Without Wire

ఈ కనెక్టర్ మీకు చార్జింగ్ ప్లగ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. మీ మొబైల్ ను ప్యాడ్ మీద పెట్ట్టగానే చార్జింగ్ అవడం మొదలవుతుంది. ఈ వైర్ లెస్ చార్జర్ ఈ ఏడాది ప్రారంభంలోనే మార్కెట్ లోకి రానున్నట్లు ఎనర్జీ స్క్వేర్ కంపెనీ ప్రకటించింది.

వైర్ లేకుండానే రూపొందించిన ఈ కొత్త జనరేషన్ చార్జర్ గురించి ఈ కంపెనీ గత మే నెలలోనే ప్రముఖ కిక్ స్టార్టర్ వెబ్ సైట్ లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ చార్జర్ ను రేపటి నుంచి అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎనర్జీ స్క్వేర్ ప్రదర్శించనుంది.

English summary
energysquare is not only about charging smartphones on surfaces. Our mission is to get rid of all electric cables and to reinvent the way we have access to energy. Charging smartphones is just a beginning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X