వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానాన్ని ఎత్తుకెళ్లిన మెకానిక్, వెంటాడిన ఎఫ్15 యుద్ధవిమానాలు, కూలిపోయింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఎత్తుకెళ్లిన ఓ విమానం ఓ చిన్న దీవిలో కూలిపోయింది. ఈ సంఘటన అమెరికాలోని టకోమా విమానాశ్రయంలో రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. ఓ ఎయిర్ లైన్ మెకానిక్ విమానాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. సైన్యం వెంటపడగా అతను తప్పించుకునే క్రమంలో విమానాన్ని ఇష్టం వచ్చినట్లు నడిపాడు. దీంతో విమానం గిరాగిరా తిరిగి కూలిపోయింది. ఈ విమానంలో ప్రయాణీకులెవరూ లేరు.

అధికారుల అనుమతి లేకుండానే జంట ఇంజిన్లుగల విమానం ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఆ సమయంలో ప్రయాణికులు లేరు. తొలుత ఉగ్రవాదులు దీన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని భావించారు. వెంటనే రెండు ఎఫ్ 15 యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. అవి వెంబడిస్తుంటే ఆ మెకానిక్‌ విమానాన్ని భయానకంగా నడిపాడు. నీటిపై నుంచి సమీప ఎత్తు నుంచి దూసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్లో వైరల్ అయ్యాయి.

Stolen plane in Seattle crash prompts airport security concerns

చివరగా ఓ దీవిలోలో కూలింది. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీనికి ఉగ్రవాదులతో సంబంధం లేదని తేల్చారు. విమానాన్ని స్థానిక మెకానిక్‌ ఎత్తుకెళ్లాడని, అతడిలో ఆత్మహత్య చేసుకోవాలనే భావనలు కనిపిస్తున్నాయని, ఒంటరిగానే అతడు ఈ పని చేశాడని, రాత్రి ఎనిమిది గంటలకు విమానాన్ని అతడు ఎత్తుకెళ్లాడని, గంటన్నర తర్వాత కూలిందని చెప్పారు.

English summary
Investigators are piecing together how an airline ground agent stole an empty Horizon Air turboprop plane, took off from Sea Tac International Airport, and fatally crashed into a small island in the Puget Sound after being chased by military jets that scrambled to intercept the aircraft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X