• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా ఉక్కిరిబిక్కిరి - భారత్-అమెరికా దోస్తీ ఎఫెక్ట్ - శత్రుత్వ బీజాలు నాటొద్దంటూ అక్కసు

|

ప్రతిష్టాత్మక 'బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా)' అనుసరించాలని, ద్వైపాక్షిక, రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-అమెరికాలు నిర్ణయించుకోవడంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. సరిహద్దులో ఆగడాలను కొనసాగుతోన్న సమయంలోనే భారత్-అమెరికా మధ్య సాన్నిహిత్యం ఇంకాస్త పెరుగడంతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత పర్యటన నేపథ్యంలో డ్రాగన్ అవాకులు పేలింది.

ట్రంప్ ఆలోచనకే కడుపులో డోకు -మళ్లీ గెలిస్తే అమెరికా గతి అంతే: హిల్లరీ క్లింటన్ ఫైర్

హైదరాబాద్ హౌజ్ వేదికగా..

హైదరాబాద్ హౌజ్ వేదికగా..

అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ తో కలిసి భారత పర్యటనకు విచ్చేసిన విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం కీలక చర్చల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ వేదికగా 2+2 ఇండియా-యూఎస్ మినిస్టీరియల్ చర్చల్లో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పొంపియో, ఎస్పర్ చర్చలు జరిపారు. ద్వైపాక్షిక రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను పటిష్టపరచుకోవాలని నిర్ణయించడంతోపాటు ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయీ సమావేశంలో. దీనిపై..

చైనా దురాక్రమణలపై గుస్సా..

చైనా దురాక్రమణలపై గుస్సా..

ఢిల్లీలో భారత్-అమెరికా మంత్రుల సమావేశం ఫలవంతంగా ముగిసిన తర్వాత పాంపియో మీడియాతో మాట్లాడుతూ, చైనా దురాక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో అమెరికా వెంట నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దీనిపై డ్రాగన్ తనదైన శైలిలో స్పందించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మంగళవారం బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ.. భారత్ పేరును ప్రస్తావించకుండానే తనకు, పొరుగుదేశాలకు మధ్య శత్రుత్వ బీజాలను అమెరికా నాటుతోందని ఆరోపించించారు.

పాంపియో.. ఆ మెంటాలిటీ వద్దు..

పాంపియో.. ఆ మెంటాలిటీ వద్దు..

‘‘వెళ్లిన చోటల్లా చైనాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం పాంపియోకు కొత్తేమీ కాదు. ఆయన చెప్పే విషయాల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు. అన్నీ నిరాధారమైన ఆరోపణలే. పొంపియో ఎల్లప్పుడూ ప్రచ్ఛన్న యుద్ధ మానసిక స్థితికి, సైద్ధాంతిక పక్షపాతానికి అంటిపెట్టుకుని ఉంటారు. కనీసం ఇకనైనా ఆయన కోల్డ్ వార్, జీరో-సమ్ గేమ్ మెంటాలిటీని వదిలిపెట్టాలి. చైనాకు, దాని చుట్టుపక్కల దేశాలకు మధ్య శత్రుత్వ బీజాలను నాటడం ఆపాలని. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలకు విఘాతం కల్పించే పనులను అమెరికా మానుకోవాలి'' అని వాంగ్ వెన్ బిన్ వార్నింగ్ ఇచ్చారు.

అడ్డంగా దొరికిన విజయసాయిరెడ్డి - మోదీ-జగన్ మధ్య ఉల్కాపాతం -పోలవరం అసలు కథ: ఎంపీ రఘురామ

English summary
China on Tuesday accused the US of sowing discord between Beijing and regional countries as the US secretary of state of Mike Pompeo held high-level talks in New Delhi with a focus on strengthening bilateral defence and strategic ties. In Beijing, the Chinese foreign ministry was specifically asked to comment on Pompeo’s visit, given that he had said earlier that it will focus on threats posed by China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X