వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ కు భారత్‌, అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

తన భూభాగాన్ని వేదికగా చేసుకొని సీమాంతర ఉగ్రవాద దాడులు జరగకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని అమెరికా, భారత్ గట్టిగా సూచించాయి. ఇరు దేశాల అధినేతలు ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటనలో పాక్ ను కోరారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పాకిస్తాన్ కు భారత్‌, అమెరికా ఉమ్మడిగా గట్టి సందేశాన్ని ఇచ్చాయి. తన భూభాగాన్ని వేదికగా చేసుకొని సీమాంతర ఉగ్రవాద దాడులు జరగకుండా పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలని గట్టిగా సూచించాయి. 26/6 ముంబై దాడులు, పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడి సూత్రధారులను చట్టం ముందుకు తెచ్చి సత్వరమే శిక్షించాలని డిమాండ్‌ చేశాయి.

ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ముమ్మరం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఉగ్రవాదుల స్వర్గధామాలను నిర్మూలిస్తామని ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉమ్మడిగా ప్రతినబూనారు.

Stop Terror From Your Territory: India, US' Tough Message To Pakistan

'ఉగ్రవాద నిర్మూలనే మాకు అత్యంత ప్రాధాన్య విషయం' అని ట్రంప్‌తో కలిసి సంయుక్త ప్రకటన చేస్తూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. తన భూభాగం వేదికగా చేసుకొని ఇతర దేశాలపై ఉగ్రవాద దాడులు జరగకుండా పాక్‌ చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతల తమ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు.

'మేం ఉగ్రవాదం, తీవ్రవాదం, అతివాదం గురించి చర్చించాం. ఈ విషయాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాం' అని మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలను, వాటిని నడిపించే భావజాలాన్ని ధ్వంసం చేయాలని ఇరుదేశాలూ నిశ్చయించినట్టు ట్రంప్‌ తెలిపారు.

English summary
Reflecting a tougher stance by the US on terrorism emanating from Pakistan, a joint statement after Prime Minister Narendra Modi's meeting with President Donald Trump called upon Pakistan not to let its territory be used to launch terror attacks. "The leaders called on Pakistan to ensure that its territory is not used to launch terrorist attacks on other countries. They further called on Pakistan to expeditiously bring to justice the perpetrators of the 26/11 Mumbai, Pathankot, and other cross-border terrorist attacks perpetrated by Pakistan-based groups," the Indo-US joint statement said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X