వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ అద్భుతాన్ని నమ్ముతారా?: వెనక్కి వెళ్లిన జలపాతం, కారణం ఇదే

|
Google Oneindia TeluguNews

స్కాట్లాండ్: జలపాతం నుంచి నీళ్లు కిందకు రావడం మనం చూస్తుంటాం. కానీ ఆ నీళ్లు వెనక్కి వెళ్లడం ఊహించలేం. కానీ ఇది జరిగింది! అయితే భారీగా వీచిన గాలుల కారణంగా ఓ జలపాతం నీరు వెనక్కి వెళ్లింది. ఈ అద్భుత సంఘటన యునైటెడ్ కింగ్‌డమ్ పరిధిలోని స్కీ దీవుల్లో చోటు చేసుకుంది.

హనీమూన్ కోసం శ్రీలంక హోటల్లో దిగి, పీకలదాకా తాగి ఈ కొత్త జంట ఏం చేసిందంటే?హనీమూన్ కోసం శ్రీలంక హోటల్లో దిగి, పీకలదాకా తాగి ఈ కొత్త జంట ఏం చేసిందంటే?

 స్కీ దీవుల్లోని జలపాతం వెనక్కి వెళ్లింది

స్కీ దీవుల్లోని జలపాతం వెనక్కి వెళ్లింది

ఇటీవల కల్లం తుఫాను స్కీ దీవులను భయాందోళనకు గురి చేసింది. అక్కడి వారిని వణికించింది. తుఫాను సమయంలో పెనుగాలులు వీచాయి. గంటకు 133 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ గాలుల తీవ్రతకు స్కీ దీవుల్లోని ఓ జలపాతంలోని నీరు కింద పడకుండా, అలా పైకి చినుకుల్లా పైకి ఎగిరిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.

తిరిగి కొండలపైకి నీరు

తిరిగి కొండలపైకి నీరు

జలపాతంలోని పెద్ద మొత్తంలో నీరు తిరిగి కొండల పైకి ఎగిసిపడింది. ఈ దృశ్యాన్ని స్కాట్లాండ్‌కు చెందిన వారు చిత్రీకరించారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది. స్కీ దీవులు ఎంతో సుందరంగా ఉంటాయి. ఇక్కడి తీర ప్రాంతాల్లో సేద తీరేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం సముద్రంలో కలిసే దృశ్యం రమణీయంగా ఉంటుంది.

వెన్ ఏ వాటర్ ఫాల్ డోంట్ ఫాల్

వెన్ ఏ వాటర్ ఫాల్ డోంట్ ఫాల్

కానీ కల్లం కారణంగా వచ్చిన తుఫాను, భారీ గాలుల కారణంగా జలపాతం కిందకు దూకే బదులు పైకి ఎగిరిపోయింది. ఇది జరిగిన ప్రాంతం తలిస్కర్ బీచ్ వద్ద. ఈ వీడియోను క్రిస్ మార్టిన్ అనే వ్యక్తి శుక్రవారం పోస్టు చేశాడు. 'వెన్ ఏ వాటర్ ఫాల్ డోంట్ ఫాల్' అని క్యాప్షన్ పెట్టాడు.

వీడియో వైరల్

వీడియో వైరల్

ఈ వీడియోకు సంబంధించి అతనికి పెద్ద ఎత్తున సందేశాలు, నోటిఫికేషన్స్ వస్తున్నాయట. ఈ వీడియోను లక్షలాది మంది చూడటమే కాకుండా 30 వేల మందికి పైగా షేర్ చేశారు. కాగా, జలపాతంలోని నీరు వెనక్కి పోవడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబర్‌ నెలలో అమెరికాలోని మిసిసిప్పీ నది కూడా వెనక్కి ప్రవహించిన దృశ్యాలు ఉన్నాయి. అప్పట్లో హరికేన్‌ ఫ్లోరెన్స్ కారణంగా ఎగసిపడ్డ అలల తీవ్రతకు ఆ నది వ్యతిరేక దిశలో ప్రవహించింది.

English summary
A reverse waterfall caused by storm Callum was captured of the camera in Scotland. The pressure caused by the wind was so severe that a water started flying upwards instead of downwards. The natural occurrence happened at Talisker beach on the Isle of Skye. Video of the reverse waterfall was recorded and shared on social media by a Facebook user Chris Martin on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X