వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్‌‌కు సియారా తుఫాను ముప్పు: గంటకు 100 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Evening News Express: 3 Minutes 10 Headlines | Storm Ciara In UK | AP woman Manga Anantatmula

బ్రిటన్ : బ్రిటన్‌ను సియారా తుఫాను వణికిస్తోంది. రానున్న 48 గంటల్లో సియారా తుఫాను విశ్వరూపం దాల్చనున్నట్లు యూకే వాతావరణ శాఖ తెలిపింది. సియారా తుఫాను ప్రభావంతో గంటకు 100 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక భారీగా వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పిన వాతావరణ శాఖ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిదని బ్రిటన్ వాసులకు సూచించింది. ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వందల సంఖ్యలో విమానాలను నిలిపివేయడం జరిగింది. పలు రైళ్లను రద్దుచేయడం జరిగింది.

సోమవారం రోజున గంటకు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఉత్తర ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్‌లలో మంచు తుఫాన్లు కూడా వచ్చే ఆస్కారం ఉందని హెచ్చరించింది.ఇక రెండో రోజున దక్షిణ ఇంగ్లాండ్‌లో కూడా భారీగా గాలులు వీస్తాయని వెల్లడించింది. రైళ్ల సేవలను పునరుద్ధరించేందుకు ఇంజినీర్లు ప్రయత్నిస్తున్న క్రమంలో తుఫాను మరింత అంతరాయం కలిగిస్తోందని నెట్‌వర్క్ రైల్ తెలిపింది. ఇప్పటికే ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకొరిగాయి.

Storm Ciara to hit Britain,100mph winds as Met Office warns of further disruption

ఇదిలా ఉంటే బ్రిటీష్ ఎయిర్‌వేస్ కూడా తమ విమాన సేవలను నిలిపివేసింది. అయితే ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నది అనేదానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఇక ఈజీ జెట్ విమానాయాన సంస్థ 200 విమాన సర్వీసులను రద్దు చేసింది. తుఫానుతో ప్రమాదం పొంచి ఉందని చెబుతూ ప్రయాణికులకు కలిగి అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది. మాంచెస్టర్ విమానాశ్రయం పరిసరాల్లో గంటకు 86 మైళ్ల వేగంతో గాలులు వీయడంతో విమానాశ్రయం చెల్లాచెదురైంది. ఇక గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా సియారా తుఫాను ప్రభావం చూపబోతోందని వాతావరణశాఖ అధికారి ఒకరు తెలిపారు.

ఇప్పటికే లాంక్‌షైర్ మరియు యార్క్‌షైర్‌లలో కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో చాలామంది తమ ఇళ్లను వీడి సురక్షిత శిబిరాలకు తరలి వెళ్లారు. ప్రస్తుతం ఇంగ్లాడ్ దేశ వ్యాప్తంగా190 వరద హెచ్చరికలు, 170 వరద అలర్ట్‌లను పర్యావరణ శాఖ జారీ చేసింది. ఆదివారం రోజున స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటల కల్లా 1,18000 ఇళ్లల్లో విద్యుత్ సరఫరా లేకుండా పోయింది. అయితే జరిగిన నష్టాన్ని లేదా జరగబోయే నష్టాన్ని ఇప్పుడప్పుడే అధిగమించలేమని బీమా సంస్థలు తెలిపాయి.

English summary
Britain is facing further mayhem over the next 48 hours in the wake of Storm Ciara which battered Britain with winds of up to 100mph causing widespread flooding and travel chaos.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X