వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రొయేషియాలో భారీ భూకంపం -రాజధాని జగ్రెబ్‌లో ఎపిసెంటర్ -పెట్రింజాలో కూలిన భవంతులు

|
Google Oneindia TeluguNews

సెంట్రల్ యూరప్‌లోని క్రొయేషియా దేశాన్ని మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియొలాజికల్ సర్వే ప్రకటించింది. ప్రకంపనల ధాటికి పెట్రింజా నగరంలోని పలు భవంతులు కుప్పకూలాయి. ఇదే ప్రాంతంలో సోమవారం కూడా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా -మోదీ తీరుపై ఆవేదననేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా -మోదీ తీరుపై ఆవేదన

సోమవారం నాటి భూకంపం కూడా తీవ్ర నష్టాన్ని మిగల్చగా, అధ్యక్షుడు జొరాన్, ప్రధాని అండ్రేజ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలోనే మరోసారి భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. క్రొయేషియాకు పొరుగున ఉన్న స్లొవేనియా, సెర్బియా, బోస్నియా దేశాల్లో కూడా భూమి కంపించింది.

 Strong 6.3 magnitude earthquake rocks central Croatia, day after strong tremors

క్రొయేషియా రాజధాని జగ్రెబ్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు చెప్పారు. భూకంప కేంద్రం నుంచి సుమారు 50 కిలోమీటర్ల పరిథిలో దీని ప్రభావం కనిపించినట్లు పేర్కొంది. భూమి అకస్మాత్తుగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి వీథుల్లోకి పరుగులు తీశారు.

బ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామబ్యాగు సర్దేసిన సీఎం జగన్ -జనవరి 10 నుంచి విశాఖలో దుకాణం -చర్చిలో ప్రమాణం: ఎంపీ రఘురామ

 Strong 6.3 magnitude earthquake rocks central Croatia, day after strong tremors

మంగళవారం నాటి భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించిందని, కొన్ని భవనాలు పూర్తిగా కుప్పకూలిపోగా, మరికొన్ని భవనాల పైకప్పులు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది. తెలిపింది. ఇదే ప్రాంతంలో సోమవారం 5.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల పెట్రింజా నగరంలో విపరీతమైన విధ్వంసం జరిగిందని తెలిపింది. ఓ కారుపై కుప్పకూలిన భవనం పడటాన్ని స్థానిక టెలివిజన్ ఛానళ్ళు చూపించాయి. ఆ కారులో ఓ వ్యక్తి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

 Strong 6.3 magnitude earthquake rocks central Croatia, day after strong tremors
English summary
A strong earthquake hit Croatia on Tuesday, with some injuries reported as well as considerable damages to roofs and buildings southeast of the capital. The European Mediterranean Seismological Center said an earthquake of 6.3 magnitude hit 46 kilometers (17 miles) southeast of Zagreb. Initial reports said the earthquake caused wide damage, collapsing roofs, building facades and even some entire buildings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X