వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6.5 తీవ్రతతో భూకంపం.. వణికిన పర్యాటక నగరం: సునామీ భయం: తప్పిన ముప్పు

|
Google Oneindia TeluguNews

మనీలా: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని మనీలాకు ఈశాన్య దిశగా మస్బాటే ప్రావిన్స్‌లో ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం. ఉదయం 8:03 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైనట్లు పేర్కొంది. భూకంపం తరువాత కూడా పలు ప్రకంపనలు నమోదైనట్లు ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సిస్మాలజీ వెల్లడించింది.

ఫోన్ ట్యాపింగ్‌లో ట్విస్ట్: చంద్రబాబుకు డీజీపీ లేఖ: ఆధారాలు ఉంటే: మాస్టర్ స్ట్రోక్: బీజేపీ నేతఫోన్ ట్యాపింగ్‌లో ట్విస్ట్: చంద్రబాబుకు డీజీపీ లేఖ: ఆధారాలు ఉంటే: మాస్టర్ స్ట్రోక్: బీజేపీ నేత

ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదు. మస్బాటే ప్రావిన్స్‌లోని కటైంగన్ నగరానికి అయిదు కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించారు. భూ ఉపరితలం నుంచి కిలోమీటర్ లోతున భూకంపం సంభవించినట్లు పేర్కొంది. తీర ప్రాంత నగరం కావడం వల్ల సునామీ భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. సునామీ ముప్పు సంభవించే ప్రమాదం ఉందంటూ స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి పరుగులు తీశారు. రోడ్ల మీదే గడిపారు.

Strong earthquake hits Manila, Philippines: National Center for Seismology

ప్రధాన భూకంపం అనంతరం వెంటవెంటనే నాలుగు సార్లు భూమి కంపించింది. ఫలితంగా స్థానికులు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. ఫిలిప్పీన్స్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్న దేశం కావడం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. వాటి తీవ్రత, ప్రభావం పెద్దగా ఉండదు. ఇదివరకు 7.7 మాగ్నిట్యూడ్‌తో సంభవించిన భూకంపంలోో రెండు వేల మందికి పైగా స్థానికులు మరణించారు.
తాజాగా నమోదైన భూకంపం మాత్రం 6.5 తీవ్రతతో కూడుకున్నది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Recommended Video

Lockdown : India Plans To Bring Back Over 14,000 Stranded Indians In 64 flights | Oneindia Telugu

భూకంపం సంభవించినట్లు సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరాన్ని ఖాళీ చేయించారు. ప్రజలు ఇళ్లల్లో ఉండకూడదంటూ హెచ్చరించారు. ఫిలిప్పీన్స్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి మస్బాటె ప్రావిన్స్‌. ఈ ప్రావిన్స్‌ను సందర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటకుల తాకిడి లేదు.

English summary
An earthquake of magnitude 6.5 was reported near Manila, Philippines on Tuesday morning, according to India's National Center for Seismology.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X