వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరూలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 8.0 నమోదు

|
Google Oneindia TeluguNews

పెరూ : ఉత్తర మధ్య పెరూలో అతిపెద్ద భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.0గా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు భూకంపం వచ్చింది. ఆ మేరకు యూఎస్ భూగర్భ పరిశోధన సంస్థ వివరాలు వెల్లడించింది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అలర్టయ్యారు.

భూకంపానికి సంబంధించి పెరూ ప్రభుత్వం కూడా స్పందించింది. ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించింది. తొలుత రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని పేర్కొంది. కల్లావు, లిమా తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదమైతే లేదని వివరించారు అధికారులు.

Strong earthquake strikes northern Peru

పెరూలో సంభవించిన భూకంపానికి సంబంధించి అక్కడి సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. రెండు, మూడు నిమిషాల పాటు భూప్రకంపనలు రావడంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశామని పేర్కొంటున్నారు. ఆగ్నేయ ల్యాగునాస్‌కు కేవలం 80 కిలోమీటర్ల పరిధిలో, అలాగే యురిమ్యాగాస్ సిటీకి 160 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు సమాచారం. డెప్త్ పరంగా 114 కిలోమీటర్ల లోతుగా ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
An earthquake with a magnitude as high as 8.0 stuck northern Peru in the early hours of Sunday morning, the United States Geological Survey reported. The quake, at an “intermediate depth” of around 110 kilometers, was felt around the country and even hundreds of miles away in the capital city of Lima, local authorities reported. There were no initial reports of casualties or of significant damage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X