వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తైవాన్‌లో భారీ భూకంపం: ఇద్దరు మృతి, హోటల్ ధ్వంసం

By Narsimha
|
Google Oneindia TeluguNews

తైపీ: తైవాన్‌లో మంగళవారం నాడు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.4 గా నమోదైంది. భూకంపం తాకిడికి ఇద్దరు మరణించారు. హోటల్ భవనం ధ్వంసమైంది. సగానికి సగం భూమిలో కుంగిపోయింది. 150 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది.

Strong Taiwan quake topples buildings

తైవాన్‌లో సంభవించిన భూకంపంతో ఓ హోటల్ కుప్పకూలిపోయింది. ఈ భవన శిథిలాల్లో సుమారు 30 మంది ఉన్నట్టు స్థానిక మీడియా ప్రకటించింది.

తూర్పు ఆసియా దేశం తైవాన్‌లో ప్రకృతి విలయతాండవం. మంగళవారం రాత్రి సంభవించిన భారీ భూకంపానికి హువాలియెన్‌ పట్టణంలో పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు కుప్పకూలిపోయాయి. వాటిల్లో వందలమంది చిక్కుకుపోయినట్లు సమాచారం. భారీ భూకంపం తర్వాత 100సార్లకుపైగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.

తైవాన్‌ తూర్పు తీరంలోని హువాలియెన్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియాలజికల్‌ సొసైటీ తెలిపింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది.

హోటల్‌ భవనంలో ఇంకా 50 మంది ఉండిఉండొచ్చని భావిస్తున్నారు. అటు నివాస సముదాయాలు కూడా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అంచనా.

భూకంప ప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. సహాయకార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

తైవాన్ లో తరచూ భూకంపాలు చోటు చేసుకొంటాయి.రెండురోజుల క్రితం కూడ తైవాన్ లో భూకంపం చోటు చేసుకొంది.

English summary
A powerful 6.4 magnitude earthquake has toppled buildings in the Taiwanese city of Hualien, media reports say.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X