విద్యార్థి మహిళా మ్యాథ్స్ టీచర్‌ను కొట్టి చంపేశాడు!

ఈ ఉపాధ్యాయురాలు అంటే విద్యార్థులకు గౌరవం, అభిమానం. ఆమె ఇంటికి రాకపోవడంతో ఫిర్యాదు అందిందని ఎసెక్స్ జిల్లా అటార్నీ తెలిపారు. అయితే పాఠశాల రెండో అంతస్తులోని బాత్ రూంలో రక్తం మరకలు కనిపించాయి. ఉపాధ్యాయురాలి మృతదేహం పాఠశాల వెనుక భాగంలో కనిపించింది.
ఉపాధ్యాయురాలి మృతికి సంబంధించిన వివరాలు పలుచోట్ల సిసి కెమెరాల్లో లభించాయి. వీటి ఆధారంగా ఫిలిప్ చిస్మ్ అనే విద్యార్థిని అరెస్టు చేశారు.
అయితే అతడు ఆమెను ఎందుకు చంపాడన్నది తెలియరాలేదు. అతనిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. అతను ఉపాధ్యాయురాలిని దారుణంగా కొట్టి చంపాడట.












Click it and Unblock the Notifications