Student: సబ్ వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి, కాల్చి చంపేశారు, కెనడాలో భారత్ విద్యార్థి హత్య !
లక్నో/బెంగళూరు: ఉన్నత చదువులు చదవాలని ఉక్రెయిన్ కు వెళ్లిన కర్ణాటకకు చెందిన ఓ యువకుడు రష్యా బాంబు దాడుల్లో అతని ప్రాణాలు పోయిన విషయం తెలిసిందే. ఆ కర్ణాటక విద్యార్థి మృతదేహం ఉక్రెయిన్ నుంచి భారత్ తీసుకురావడానికి చాలా రోజుల సమయం పట్టింది. విదేశాల్లో చదువుకోవాలని ఆశపడుతున్న విద్యార్థులకు ఉక్రెయిన్-రష్యా యుద్దం పెద్ద షాక్ ఇచ్చింది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చెయ్యాలని కెనడాకు వెళ్లిన భారత్ యువకుడు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైనాడు. చోరీ చెయ్యడానికి వేచిచూస్తున్న నిందితులు సబ్ వే నుంచి బయటకు వచ్చిన భారతీయుడిని దారుణంగా చంపేసి వాళ్లపని వాళ్లు చేసుకుని చెక్కేశారు. ఉన్నత చదువులు చదవడానికి మూడు నెలల ముందే విదేశాలకు వెళ్లిన యువకుడు దుండుగల చేతిలో హత్యకు గురైనాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు హడలిపోయారు.

భారత్ విద్యార్థులు
భారతదేశానికి చెందిన లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెలుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఉక్రెయిన్ లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు రష్యా అరాచకాలకు హడలిపోయింది. ఉక్రెయిన్ దేశం మీద రష్యా విరుచుకుపడి యుద్దం మొదలు పెట్టడంతో అక్కడ చదువుతున్న విద్యార్థులను భారత్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా శ్రమించ వలసి వచ్చింది.

రష్యా దెబ్బకు భారత్ విద్యార్థి బలి
కర్ణాటకకు చెందిన నవీన్ అనే యువకుడు ఉక్రెయిన్ లో ఉన్నత చదువులు చదవాలని వెళ్లాడు. ఇదే ఏడాది ఉన్నత చదువులు పూర్తి చేసుకుని భారత్ తిరిగి వచ్చేయాలని నవీన్ అనుకున్నాడు. అయితే 20 రోజుల క్రితం రష్యా బాంబుదాడుల్లో నవీన్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కర్ణాటక విద్యార్థి నవీన్ మృతదేహం ఉక్రెయిన్ నుంచి భారత్ తీసుకురావడానికి చాలా రోజుల సమయం పట్టింది.

చదువుకోవడానికి కెనడా వెళ్లాడు
విదేశాల్లో చదువుకోవాలని ఆశపడుతున్న విద్యార్థులకు ఉక్రెయిన్-రష్యా యుద్దం పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరో షాకింగ్ విషయం మరోకటి వెలుగు చూసింది. కెనడాలో మేనేజ్ మెంట్ కోర్సు చదవడానికి వెళ్లిన ఉత్తర ప్రదేశ్ లోని ఘాజియాబాద్ కు చెందిన కార్తీక్ అలియాస్ కార్తీ అనే యువకుడిని దండుగులు కాల్చి చంపేయడం కలకలం రేపింది.

చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్న కార్తీక్
కెనడాలో ఉన్నత చదువులు చదవడానికి గత జనవరి నెలలోనే ఘాజియాబాద్ నుంచి కార్తీక్ కెనడా వెళ్లాడని అతని తండ్రి అంటున్నాడు. మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్న కార్తీక్ అక్కడి ఓ రెస్టారెంట్ లో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడని అతని తండ్రి ఉత్తరప్రదేశ్ లోని మీడియాకు చెప్పారు.

జనవరిలో వెళ్లి ఏప్రిల్ కు శవమైనాడు
స్థానిక కాలమానం ప్రకారం వేకువ జామున 5 గంటల సమయంలో అండర్ గ్రౌండ్ సబ్ వే నుంచి బయటకు వస్తున్న కార్తీక్ ను డబ్బులు ఇవ్వాలని దుండుగులు బెదిరించారని, ఆ సమయంలో డబ్బులు లేవని చెప్పిన కార్తీక్ ను కాల్చి చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానిక మీడియా తెలిపింది. ఉన్నత చదువులు చదవడానికి వెళ్లిన కార్తీక్ కేవలం మూడు నెలల్లోనే హత్యకు గురి కావడంతో అతని కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు.