వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరికొత్త అధ్యయనం : అధిక బరువు,క్యాన్సర్‌‌పై విస్తుపోయే విషయాలు..

|
Google Oneindia TeluguNews

అధిక బరువుతో బాధపడేవారికి క్యాన్సర్,డయాబెటీస్,గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ అని ఇదివరకు చాలా అధ్యయనాల్లో తేలింది. అందుకే చాలామంది బాడీ మాస్ ఇండెక్స్(BMI)సాధారణ స్థాయిలో ఉంచుకునేందుకు అవసరమైన డైట్ పాటిస్తుంటారు. అయితే బాడీ మాస్ ఇండెక్స్(BMI)అధికంగా ఉన్నవారు త్వరగా క్యాన్సర్,డయాబెటీస్,హృద్రోగాల బారిన పడుతారన్నది కేవలం అపోహేనా..? అపోహ కాదు.. కానీ కొన్ని కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉందంటున్నాయి తాజా అధ్యయనాలు.

తాజా రీసెర్చ్

తాజా రీసెర్చ్

ఆస్ట్రేలియాకు చెందిన క్యాన్సర్ అధ్యయనకారులు తమ క్లినికల్ ట్రయల్స్‌లో కొత్త విషయం కనిపెట్టారు. బాడీ మాస్ ఇండెక్స్(BMI) ఎక్కువగా ఉన్నవారిలో కొందరు కొన్ని రకాల క్యాన్సర్ల బారి నుండి బయటపడేందుకు మెరుగైన అవకాశం ఉన్నట్టు కనుగొన్నారు. తమ అధ్యయనాల ద్వారా సాధించిన ఫలితాల గురించి జామా ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ఇందుకోసం మొత్తం 1434 మంది క్యాన్సర్ పేషెంట్లను పరిశీలించగా.. ఇందులో 49శాతం మంది సాధారణ బరువు ఉన్నవారు,39శాతం మంది అధిక బరువు,7శాతం మంది ఊబకాయులు ఉన్నారు.

రీసెర్చర్స్ ఏమంటున్నారు..

రీసెర్చర్స్ ఏమంటున్నారు..

అధికబరువు,ఊబకాయంతో బాధపడేవారికి క్యాన్సర్,గుండె జబ్బులు,డయాబెటీస్ వంటివి వచ్చే అవకాశం ఎక్కువ అన్న అధ్యయనాలతో తాజా అధ్యయనం విబేధించడం గమనార్హం.

క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి కొత్త ఆవిష్కరణల కోసం ఫ్లిండర్స్ సెంటర్‌ మెడికల్ ఆంకాలజీ ప్రధాన పరిశోధకుడిగా పనిచేస్తున్న డా. గనేసన్ కిచెనదస్సే తమ తాజా అధ్యయనం
గురించి వెల్లడించారు. బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న కొంతమందిలో క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే డ్రగ్స్ బాగా పనిచేస్తున్నట్టు చెప్పారు.తాము సాధించిన తాజా ఫలితాలు భవిష్యత్‌లో చేయబోయే అధ్యయనానికి కావాల్సిన స్థైర్యాన్ని ఇచ్చాయన్నారు.

మరింత అధ్యయనం

మరింత అధ్యయనం

బాడీ మాస్ ఇండెక్స్(BMI),దానివల్ల కలిగే జబ్బుల గురించి మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని గనేసన్ చెప్పారు. తద్వారా క్యాన్సర్‌ చికిత్సలో ఇప్పటివరకు ఇస్తున్న డ్రగ్స్‌తో అనుకున్న ఫలితాలు సాధించకపోవడం వెనుక ఉన్న విధానాలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందన్నారు.

 కొంతమందిలో క్యాన్సర్ తగ్గుముఖం..

కొంతమందిలో క్యాన్సర్ తగ్గుముఖం..

తమ అధ్యయనంలో భాగంగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో బాడీ మాస్ ఇండెక్స్(BMI)ఎక్కువగా (25kg/m2)ఉన్నవారిలో క్యాన్సర్ తగ్గుముఖం పట్టినట్టుగా గుర్తించినట్టు రీసెర్చర్స్ చెప్పారు. ఇమ్యూనోథెరపీ ట్రీట్‌మెంట్ కూడా దీనికి కారణమని తెలిపారు. భవిష్యత్‌లో తమ అధ్యయనం ద్వారా మరిన్ని సానుకూల ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

English summary
While above average or high BMI is often linked to cancers,diabetes,cardiovascular and other diseases, in some cases the higher level of BMI can improve the chance of survival among certain cancers suggests new research
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X