వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖడ్గం మృగం రైనోకు జడ్ ప్లస్ భద్రత: కంటికి రెప్పలా

|
Google Oneindia TeluguNews

సూడాన్: కొన్నివిషయాలు వింటే వింతగానే ఉంటుంది. కాని నమ్మాలి. నమ్మక తప్పదు. రాజకీయ నాయకులు ప్రత్యర్థుల నుండి ముంపు ఉంటుందని భయంతో జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఎర్పాటు చేసుకుంటారు.అందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు.

ఇది ప్రపంచంలోని అన్ని దేశాలలోని రాజకీయ నాయకులకు వర్థిస్తుంది. అయితే ఒక మృగం, అదీ ఖడ్గ మృగం. ఈ ఖడ్గ మృగానికి 24 గంటలు జడ్ ప్లస్ భద్రత. కంటికి రెప్పలా కాపాడే చాకు ల్లాంటి కమాండోలు. ఎవరైనా దాని జోలికి వెళితే క్షణాలలో మిషిన్ గన్ ల నుండి బుల్లెట్ లు దూసుకు వస్తాయి.

సూడాన్ ప్రభుత్వం ఒక ఖడ్గ మృగాన్ని కాపాడటానికి ప్రత్యేక జాగ్రతలు తీసుకుంటున్నది. అది ఎక్కడికి వెళ్లినా దాని చుట్టు కమాండోలు, సాయుధ బలగాలు. ఎందుకంటే ప్రపంచంలో మిగిలిన ఏకైక తెల్ల ఖడ్గ మృగం అది. దానిని వేటగాళ్లు చంపేస్తే ఇక ప్రపంచంలో తెల్ల ఖడ్గ మృగాన్ని మనం చూడలేం.

Sudan is the last male northern white rhino in the world

అందుకే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైనో (43) అనే ఈ తెల్ల ఖడ్గ మృగం అదృష్టం చేసుకుంది. ఈ రైనో 50 సంవత్సరాలు మాత్రం బ్రతికే అవకాశం ఉంది. ప్రపంచంలో ప్రస్తుతానికి ఐదు ఖడ్గ మృగాలు ఉన్నాయి. రైనోతో కలిపి మూడు ఓఐ పెజేటా అభయారణ్యంలోని జంతుశాలలో ఉన్నాయి. రెండు శాన్ డిజియోలోని జూలో ఉన్నాయి.

నాలుగు తెల్ల ఖడ్గ మృగాల వలన సంతతి పెరగాలంటే రైనో వల్లనే సాధ్యం. రైనో అంతం అయితే ఇక తెల్ల ఖడ్గ మృగాల పని అయిపోయినట్లే. అందుకే సూడాన్ ప్రభుత్వం చాల జాగ్రతలు తీసుకుంటున్నది. మగ తెల్ల ఖడ్గ మృగం రైనో కొమ్ముల వలన దానికే ఏమైనా ప్రమాదం వస్తుందనే భయంతో వాటి కోమ్ములు కొసి వేశారు.

ఖడ్గ మృగాల అవయవాలు, మాంసం, రక్తం, వాటి కొమ్ములకు ప్రపంచంలో మంచి డిమాండ్ ఉంది. వాటితో అనేక రోగాలు నయం చెయ్యడానికి ఔషదాలు తయారు చేస్తారు. వేటగాళ్ల వలన దేశ విదేశాలలో ఖడ్గ మృగాలను దారుణంగా చంపేసి అవయవాలు తీసుకు వెళుతున్నారు.

ఖడ్గమృగాలను కాపాడుకోవడం కోసం ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన జాగ్రతలు తీసుకుంటున్నాయి. ఇక ప్రపంచంలో ఉన్న ఏకైక తెల్ల ఖడ్గ మృగాన్ని కాపాడుకోవడం కోసం సూడాన్ ప్రభుత్వం ఎన్ని జాగ్రతలు తీసుకొవాలి చెప్పండి.

English summary
A northern white rhinoceros named Sudan is now being accompanied around-the-clock by armed guards as he roams the Ol Pejeta wildlife refuge in Kenya
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X