• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫోటోస్ వైరల్ : ఆ రాజసం ఎక్కడ.. ఆహారం లేక తల్లడిల్లిపోతున్న సింహాలు,ఆదుకోవాలంటూ..!

|

సూడాన్: సాధారణంగా సింహాలు ఎలా ఉంటాయి..? చాలా బలంగా దిట్టంగా ఉంటాయి. సింహం గాండ్రిస్తే చాలు కొన్ని కిలోమీటర్ల వరకు ఆ గాడ్రింపు వినిపిస్తుంది. సింహం జూలు విదిల్చి పంజా విసిరిందంటే చాలు అవతల ఉన్న జంతువు ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే. అందుకే సింహాన్ని అడవికి రారాజు అని పిలుస్తాం. జూలలో సింహాలను చూసేందుకు చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. కానీ ఆ దేశంలో మాత్రం సింహాలను చూస్తే అది సింహమేనా అనే అనుమానం కలగక మానదు. ఇంతకు ఆ సింహాలు ఉన్న దేశమేది.. అవి సింహాలేనా అనే అనుమానం ఎందుకు వస్తుంది.?

 ఇవి సింహాలేనా..?

ఇవి సింహాలేనా..?

సింహాల్లో ఆఫ్రికా జాతి సింహాలకు ఓ రేంజ్‌లో పేరుంది. కానీ అదే ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో మాత్రం సింహాలను చూస్తే అవి సింహాలేనా అనే అనుమానం కలగక మానదు. అక్కడి సింహాలు చాలా బక్కచిక్కి పోయాయి. ఇందుకు కారణం సింహాలు ఉన్న జూలో కరవు తాండవిస్తోంది. సింహాలు తినేందుకు ఆహారం కూడా లేదు. వీటిని చూస్తే భయం పక్కన పెడితే జాలి కలుగుతుంది. అంతలా వీటి రూపు రేఖలు మారిపోయాయి. ఎముకలు బయటకు కనిపిస్తూ అసలు ఇవి సింహాలేనా అని అనిపించక మానదు.

సూడాన్‌లో అల్ ఖురేషీ పార్క్‌ సింహాల దీనగాథ

సూడాన్‌లో అల్ ఖురేషీ పార్క్‌ సింహాల దీనగాథ


సుడాన్‌లోని ప్రముఖ అల్ ఖురేషీ పార్క్‌లో బోనులో ఉన్న సింహాలను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. కొన్ని వారాలుగా అక్కడి సింహాలకు తినేందుకు ఆహారం లేదట. అంతేకాదు అనారోగ్యంకు గురైన సింహాలకు సరైన చికిత్స కూడా అందుబాటులో లేదట. అయితే ఈ పార్కును సందర్శిస్తున్న సందర్శకులు చాలామంది వీటి పరిస్థితి చూసి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ సింహాలను వెంటనే మరో చోటికి తరలించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

 సింహాల శరీరం నుంచి బయటకు వస్తున్న ఎముకలు

సింహాల శరీరం నుంచి బయటకు వస్తున్న ఎముకలు


ఉస్మాన్ సలీహ్‌ అనే జంతు ప్రేమికుడు ఏకంగా ఫేస్‌బుక్ ద్వారా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. ఈ సింహాల పరిస్థితిని చూసి తనకు ఎంతో జాలి వేసిందని ఉస్మాన్ తెలిపాడు. వాటి ఎముకలు శరీరంలో నుంచి బయటకు చొచ్చుకొస్తున్నాయని పోస్టులో రాసుకొచ్చాడు. జంతు ప్రేమికులు ఈ సింహాలను ఆదుకోవాలని సహాయం చేయాలని అర్థించాడు. ఇదిలా ఉంటే పార్కు సిబ్బంది కూడా తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. చాలా సింహాలు సగానికి పైగా బరువు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం గత కొన్ని వారాలుగా సింహాలు తినేందుకు ఆహారం లేదని చెప్పుకొచ్చారు. తమ సొంత జేబుల్లో నుంచి వాటి ఆహారం కోసం ఖర్చు చేస్తున్నట్లు పార్కు సిబ్బంది వెల్లడించింది.

క్రమంగా తగ్గుతున్న ఆఫ్రికన్ సింహాల సంఖ్య

క్రమంగా తగ్గుతున్న ఆఫ్రికన్ సింహాల సంఖ్య

ప్రస్తుతం సుడాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంను ఎదుర్కొంటోంది. దీంతో ఆహార ధరలు ఆకాశానంటుతున్నాయి. అంతేకాదు కరెన్సీ కొరత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సింహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత పార్కును జంతు ప్రేమికులు , జర్నటిస్టులు సందర్శించారు. ఇక్కడ వారికి బాధాకరమైన దృశ్యాలు కనిపించాయి. ఐదు సింహాల్లో ఒక సింహంను తాడుతో కట్టివేసి దానికి డ్రిప్ ద్వారా ద్రవాలను అందిస్తున్నారు. అక్కడక్కడ కుల్లిన మాంసం కనిపించిందని చెప్పారు. ఇక పార్కు పరిసరాలు శుభ్రంగా కనిపించకపోవడంతో సింహాలు తరచూ అనారోగ్యంకు గురవుతున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్రికా సింహాల సంఖ్య విపరీతంగా పడిపోయింది. 1993 నుంచి 2014కు 43శాతం సింహాలు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం 20వేల సింహాలు మాత్రమే బతికి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

English summary
Online calls to help save five “malnourished and sick” African lions at a park in Sudan’s capital grew on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X