వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో ఒక్కసారిగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. అంధకారంలోకి ప్రధాన నగరాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరాచీ సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది

పాకిస్తాన్‌లో దేశ వ్యాప్తంగా విద్యుత్ కోతల నడుమ నిరసన వ్యక్తం అవుతోంది. కొన్నిచోట్ల నెమ్మదిగా విద్యుత్ సేవలను పునరుద్ధరిస్తున్నారు.

అర్ధరాత్రి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో దేశం అంధకారంలోకి వెళ్లిపోయింది. విద్యుత్ పునరుద్ధరణకు కొన్ని గంటల సమయం పడుతుందని, అందరూ ప్రశాంతంగా ఉండాలని అధికారులు సూచించారు.

పాక్‌లో విద్యుత్ కోతలు సర్వసాధారణం. ఆసుపత్రులు, ఇతర అత్యవసర సేవల కేంద్రాలు డీజిల్‌తో నడిచే జనరేటర్లను ముందుగా సిద్ధంచేసి పెట్టుకుంటాయి.

''విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోపాల వల్ల ఒక్కసారిగా దేశం మొత్తం సరఫరా నిలిచిపోయింది’’అని పాక్ విద్యుత్ శాఖ మంత్రి ఒమర్ ఆయుబ్ ఖాన్ ఆదివారం తెల్లవారుజామున తెలిపారు.

కరాచీ సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది

ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ తదితర ప్రధాన నగరాలన్నీ ప్రాభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. పెషావర్ సహా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సేవలను పునరుద్ధరించగలిగామని ఒమర్ తెలిపారు.

ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీచేసినట్లు ఆయన వివరించారు.

విద్యుత్ కొరత వల్ల కొన్నిసార్లు పాక్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంటారు. కొన్నిసార్లు గంటలపాటు కోతలు విధిస్తుంటారు. దీనిపై చాలాసార్లు ఇక్కడ నిరసనలు కూడా జరిగాయి.

2013లో వాయువ్య బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ విద్యుత్ కర్మాగారంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాక్ విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Sudden power outage in Pakistan,Major cities in darkness
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X