వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ అకాడమీలో ఉగ్రదాడి: 13మంది మృతి

|
Google Oneindia TeluguNews

మొగాదిషు: సోమాలియా రాజధాని మొగాదిషులో గురువారం ఉగ్రదాడి జరిగింది. స్థానిక పోలీసు శిక్షణ శిబిరంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి తెగబడటంతో సుమారు 13 మంది మృతిచెందారు.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జనరల్‌ కహియే పోలీస్‌ శిక్షణా కేంద్రంలో గురువారం ఉదయం పోలీస్‌ పరేడ్‌ జరుగుతుండగా శరీరానికి పేలుడు పదార్థాలు చుట్టుకున్న ఓ ఆగంతకుడు ప్రాంగణంలోకి చొరబడ్డాడు.

 Suicide bomber blows himself inside police academy in Somalia's capital: 13 killed

అనంతరం తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. గాయపడిన మరో 15 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

దుండగుడు పోలీస్‌ దుస్తుల్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ అల్‌ షబాబ్‌ ప్రకటించుకుంది. ఈ సంస్థ సోమాలియాలో గత కొంత కాలంగా మారణహోమాన్ని సృష్టిస్తోంది.

English summary
A suicide bomber blows himself up inside the main police academy in Somalia's capital Mogadishu killing 13 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X