వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్గనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి: 31 మంది మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కాబూల్: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ ఓటరు రిజిస్ట్రేషన్ కేంద్రంపై ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 31 మంది మృతి చెందారు. యాభై మందికి పైగా గాయాలయ్యాయి.

నేషనల్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కోసం వచ్చిన సామాన్యులను సూసైడ్ బాంబర్ లక్ష్యంగా పెట్టుకున్నాడని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి వాహిద్ మజ్రో, కాబుల్ పోలీస్ చీఫ్ జనరల్ దాద్ అమిన్‌లు వెల్లడించారు. ఈ ఘటనలో 54 మంది గాయపడినట్లు చెప్పారు.

 Suicide bomber strikes in Afghanistan capital, 31 killed

పేలుడు ప్రభావం కొన్ని కిలోమీటర్ల మేర కనిపించింది. దగ్గరలోని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలోని రోడ్లను బ్లాక్ చేశారు. అక్కడి నుంచి కేవలం అంబులెన్సులకు మాత్రమే దారి కల్పించారు.

కాగా, ఈ దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూప్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఆప్ఘనిస్తాన్‌లో అక్టోబర్‌లో పార్లమెంటరీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ నమోదు ప్రక్రియ చేపట్టారు.

English summary
At least 31 people were killed on Sunday after a suicide bomber struck a voter registration center in Afghanistan capital Kabul. Public Health Ministry spokesman Wahid Majro said another 54 people were wounded in the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X