• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుల్తాన్ ఖబూస్ ఇకలేరు : ఒమన్ సృష్టికర్తగా శాంతి దూతగా గుర్తింపు

|

బీరట్: ఒకప్పుడు ప్రపంచ దేశాల సరసన లేని ఒమన్‌ దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపిన రాజు సుల్తాన్ ఖబూస్ బిన్ సైద్ కన్నుమూశారు. గల్ఫ్ దేశాల మధ్య శాంతిమంత్రం ప్రకటించి ఆపై ఒమన్‌కు ఒక గుర్తింపు తీసుకొచ్చారు సుల్తాన్ ఖబూస్. ఖబూస్ మృతి చెందేనాటికి ఆయన వయస్సు 79 ఏళ్లు. ఖబూస్ మృతిని ఆదేశ ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ధృవీకరించింది. అయితే తన మృతికి గల కారణాలను మాత్రం వివరించలేదు. 2014 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఖబూస్‌కు యూరోప్ దేశంలో చికిత్స అందిస్తున్నారు.

ఒమన్‌ను అభివృద్ధి బాటలో నడిపిన వ్యక్తిగా కీర్తి

ఒమన్‌ను అభివృద్ధి బాటలో నడిపిన వ్యక్తిగా కీర్తి

ఒకప్పుడు అభివృద్ధి అంటే తెలియని ఒమన్ దేశంలో.... ప్రధాన వనరులుగా ఉన్న చమురు నిక్షేపాలనే అస్త్రంగా మలుచుకుని దేశాన్ని అభివృద్ధి బాటలో నడపడంలో సుల్తాన్ ఖబూస్ కీలకంగా వ్యవహరించారు. ఒమన్ దేశంలో రహదారులు, పోర్టులు, యూనివర్శిటీలు, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంతో పాటు ఆదేశాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లారు ఖబూస్. అరబ్బు దేశాల్లో ఒక దేశానికి అత్యధిక కాలంగా రాజుగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుల్తాన్ ఖబూస్. ఆర్థికంగా ఒమన్ దేశం కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలో ఖబూస్ తన సాహసోపేతమైన నిర్ణయాలతో ఆదేశాన్ని ముందుకు నడిపించారు. ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే పోర్టుల్లో ఒమర్ నౌకాశ్రయం నిలిచిందంటే అందుకు కారణం ఖబూస్ అనే చెప్పాలి. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో శాంతికోసం తపించిన దూతగా మంచి పేరును సంపాదించుకున్నారు సుల్తాన్ ఖబూస్.

 1970 నుంచి అత్యధిక కాలంగా పాలించిన రాజుగా గుర్తింపు

1970 నుంచి అత్యధిక కాలంగా పాలించిన రాజుగా గుర్తింపు

1970లో బ్రిటన్ సహాయంతో తిరుగుబాటు చేసి పగ్గాలు చేపట్టిన సుల్తాన్ ఖబూస్ అప్పటి నుంచి ఒమన్ రూపు రేఖలను మార్చేశారు. సుల్తాన్ ఖబూస్ మృతికి మూడు రోజులపాటు సంతాపదినాలను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై ఒమన్ జాతీయ జెండాను అవనతం చేశారు. ఇక సుల్తాన్ ఖబూస్‌కు సంతానం ఎవరూ లేకపోవడంతో తన వారసుడు ఎవరుంటారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 1996లో చేసిన చట్టం ప్రకారం ఆ పదవి ఖాళీ అయిన మూడురోజులకు ఈ కుటుంబం నుంచే కొత్త వారసులను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఖబూస్‌కు సంతానం లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఎవరినైనా ప్రకటించే అధికారం ఉంటుంది. ఒక వేళ సుల్తాన్ ఖబూస్ కుటుంబ సభ్యులు ప్రకటించకపోతే బాధ్యతలను మిలటరీ, భద్రతాధికారులు, సుప్రీంకోర్టు చీఫ్‌, అసెంబ్లీలు తీసుకుంటాయి.

వారసుడికి ఎదురు కానున్న పెను సవాళ్లు

వారసుడికి ఎదురు కానున్న పెను సవాళ్లు

ప్రస్తుతం ఈ పదవిని అధిష్టించే వారికి పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యలు ఒక పెద్ద సవాల్‌గా మారనున్నాయి. అయితే సుల్తాన్ బంధువులు అయిన అసద్, శిహాబ్, హైతం బిన్ తారిఖ్ ల్-సైద్‌లకు పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా సౌదీ అరేబియాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో సుల్తాన్ ఖబూస్ మృతి చెందడం ఒమన్ దేశానికి మరింత కష్టాలు తీసుకొచ్చే అవకాశం ఉంది.

సుల్తాన్ ఖబూస్ మృతి

ఇదిలా ఉంటే సుల్తాన్ ఖబూస్ మృతికి ప్రపంచ దేశ నేతలు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఖబూస్ మృతికి సంతాపం తెలిపారు. గల్ఫ్ దేశాల్లో శాంతియుత వాతావరణం కోసం ఖబూస్ పరితపించారని ఎంతో కృషి చేశారని కొనియాడారు. భారత్ ఒక మంచి మిత్రుడిని కోల్పోయిందని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. ఒమన్‌ను ఒక ఆధునిక దేశంగా మార్చడంలో ఆయన కృషి వర్ణించలేమని మోడీ ట్వీట్ చేశారు. మంచి విజన్ ఉన్న నాయకుడని మోడీ కొనియాడారు.

 ఇరాన్ అణుఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన ఖబూస్

ఇరాన్ అణుఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన ఖబూస్

అమెరికా ఒమన్ దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు టెహ్రాన్‌తో కూడా స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే 2013లో ఒమన్ దేశం జరిపిన రహస్య మధ్యవర్తిత్వం చర్చల ఫలితంగా అమెరికా ఇరాన్‌ దేశాల మధ్య అణు ఒప్పందం జరిగింది. 2018లో ఈ ఒప్పందంను అమెరికా తెంచుకుంది. ఇక సుల్తాన్ ఖబూస్ మృతి ఆ దేశానికి కచ్చితంగా తీరనిలోటే అని చెప్పాలి. వచ్చే వారసుడికి ఒమన్ దేశాభివృద్ధి ప్రస్తుత పరిస్థితుల్లో పెను సవాల్‌గా మారనుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Oman's ailing Sultan Qaboos bin Said, one of the Middle East's longest serving rulers, died on Friday and the Gulf state's high military council called on the ruling family to convene to choose a successor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X