వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునితా విలియమ్స్‌కు మరో గౌరవం: పౌర అంతరిక్ష విమానంలో ఆమె సహా 9మంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: తొలి మానవసహిత వాణిజ్య అంతరిక్షయాత్రకు వెళ్లే వ్యోమగాముల జాబితాలో భారతసంతతికి చెందిన సునితా విలియమ్స్ సహా 9 మంది వ్యోగాములు ఉన్నారు. వీరంతా 2019 ప్రథమార్థంలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థ తయారు చేసిన బోయింగ్ సీఎస్టీ 100, స్పెస్ ఎక్స్ సంస్థ రూపొందించిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఈ వ్యోమగాములను నాసా పంపించనుంది.

2011లో స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిపోయిన తర్వాత అమెరికా భూభాగం నుంచి ఇప్పటి వరకు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించలేదు. తమ సహకారంతో బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలు అభివృద్ధి చేసిన ఆధునిక అంతరిక్ష నౌకల సహాయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు నాకా తెలిపింది. సునితా, మరో వ్యోమగామి జోష్ కస్పాడాతో కలిసి స్టార్ లైనర్ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రంపై అడుగుపెడతారని తెలిపింది.

Sunita Williams Will be Among First 9 Astronauts to Fly SpaceX and Boeings Brand-new Spaceships

52 ఏళ్ల సునీతా విలియమ్స్‌ బోయింగ్‌కు చెందిన సీఎస్‌టీ 100 స్టార్‌లైనర్‌లో జోష్‌ కస్సాడాతో కలసి అంతరిక్షంలోకి పయనమవుతారని నాసా పేర్కొంది. సునీతా ఇప్పటికే రెండు దఫాల్లో 321 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో గడిపారు. 2012లో ఆమె తన చివరి అంతరిక్ష ప్రయాణం జరిపారు. కస్సాడాకు ఇది తొలి యాత్ర. బోయింగ్, స్పేస్‌ఎక్స్‌కు సంబంధించిన స్పేస్‌షిప్‌లతో మొత్తం నాలుగుసార్లు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.

ఇప్పటి వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు అమెరికా వ్యోమగాములు రష్యాకు చెందిన సోయేజ్ స్పేస్‌క్యాప్సుల్‌ను ఉపయోగించేవారు. అయితే తొలిసారి అమెరికా కంపెనీలు కమర్షియల్ క్యాప్సుల్స్‌ను నిర్మించాయి. అమెరికా కంపెనీలే వాటిని తయారు చేశాయి. ఆ స్పేస్ క్యాప్సుల్స్‌లో వ్యోమగాములు వెళ్లనున్నారు.

English summary
Indian origin astronaut Sunita Williams is among the nine astronauts named by NASA on Friday for its first human spaceflight programme since the retirement of the space shuttle in 2011.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X