• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Super police: డాన్ కాదు, గ్యాంగ్ స్టర్ అంతకంటే కాదు, గాడిదకు బెయిల్, పోలీస్ జీ... యే క్యా హై ?

|

ఇస్తామాబాద్/ పంజాబ్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతోంది. భారత్ దాయాది దేశంలో పాకిస్థాన్ లో ఒక లక్ష 39 వేలకు పైగా కరోనా వైరస్ వ్యాధి కేసులు నమోదైనాయి. పాకిస్థాన్ లో ఉగ్రవాదులు, దావూద్ ఇబ్రహీం లాంటి గ్యాంగ్ స్టర్లు తలదాచుకున్నా వారిని అరెస్టు చెయ్యకుండా ప్రపంచ దేశాల దగ్గర పాకిస్థాన్ మొటిక్టాయలు వేయించుకుంటున్నా బుద్దిమాత్రం రాలేదు. అయితే ఇప్పుడు పాకిస్థాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఏదో గొప్పగా ఒక డాన్ నో, ఉగ్రవాదినో, లేక గ్యాంగ్ స్టర్ నో అరెస్టు చేశామని బిల్డప్ ఇచ్చిన పోలీసులు ఓ గాడిదను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. దానికి బెయిల్ ఇవ్వాలని గాడిద యజమాని కోర్టును ఆశ్రయించడంతో న్యాయమూర్తి షాక్ కు గురైనారు. ఇంతకు ఆ గాడిద చేసిన తప్పు ఏమిటి ? ఎందుకు నాలుగు రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టారు అని న్యాయమూర్తి ప్రశ్నించగా పోలీసులు ఇచ్చిన సమాధానంతో ఆయనతో పాటు న్యాయవాదులు, ప్రజలు మరోసారి షాక్ కు గురైనారు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

 నిద్రలేచినప్పటి నుంచి పాకిస్థాన్ కు అదే పని

నిద్రలేచినప్పటి నుంచి పాకిస్థాన్ కు అదే పని

భారత్ దాయాది దేశం పాకిస్థాన్ లో ఎక్కడ లేని రూల్స్ ఉన్నాయి. ఉగ్రవాదులు, టెర్రరిస్టులు బహిరంగంగా మీటింగ్ లు పెట్టి విధ్వంసాలు సృష్టించినా అక్కడి ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా అనిపించదు. ప్రతిరోజు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు భారత్ మీద ఆరోపణలు చెయ్యడమే పాకిస్థాన్ పని. అయితే పాకిస్థాన్ లో పేకాట, గ్యాంబ్లింగ్ ఆడటం నిషేధించారు.

 ఏదో కొంపలు మునిగిపోయాయని !

ఏదో కొంపలు మునిగిపోయాయని !

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలోని రహీం మార్ ఖాన్ నగర్ లోని ఓ బంగ్లాలో అక్రమంగా పేకాట ఆడుతున్నారని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఏదో కొంపలు మునిగిపోయాయని పోలీసుల బలగాలు అక్కడికి వెళ్లాయి. తరువాత ఆ బంగ్లాలో అక్రమంగా పేకాట ఆడుతున్నారని ఆరోపిస్తు 8 మంది పేకాట పాపారాయళ్లను పోలీసులు అరెస్టు చేసి జీపుల్లో ఎక్కించారు.

 అంత వరకు స్టోరీ బాగానే ఉంది

అంత వరకు స్టోరీ బాగానే ఉంది

8 మంది పేకాటరాయళ్లను అరెస్టు చేసిన పోలీసులకు ఆ బంగ్లా ఆవరణంలో ఓ గాడిద కనపడింది. పేకాట ఆడుతున్న ఓ వ్యక్తికి చెందిన గాడిద అని పోలీసులు గుర్తించారు. పేకాట ఆడుతున్న వారి దగ్గర నుంచి విలువైన మొబైల్ ఫోన్లతో పాటు కార్లు, వాహనాలతో పాటు పాకిస్థాన్ కరెన్సీ రూ. 1, 20, 000 పోలీసులు సీజ్ చేశారు. పనిలో పనిగా పేకాట రాయుడికి చెందిన గాడిదను అరెస్టు చేసిన పోలీసులు దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ఆవరణంలో నాలుగు రోజుల పాటు కట్టేశారు.

 పోలీస్ జీ..... యే క్యా హై ?

పోలీస్ జీ..... యే క్యా హై ?

రెండు రోజుల క్రితం పేకాట ఆడుతున్న 8 మందితో పాటు అరెస్టు చేసిన గాడిదకు బెయిల్ మంజూరు చెయ్యాలని వారి తరపు న్యాయవాది స్థానిక కోర్టును ఆశ్రయించారు. పేకాట ఆడుతున్న వారికి బెయిల్ ఇవ్వాలని కోరడం తప్పు లేదని, అసలు గాడిదను ఎందుకు అరెస్టు చేశారని న్యాయమూర్తి ఆరా తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులను పిలిపించిన న్యాయమూర్తి పోలీస్ జీ యే క్యా హై అని ప్రశ్నించారు.

 రేసు గుర్రం తెలుసు, రేసు గాడిద ఏందిరా బాబు ?

రేసు గుర్రం తెలుసు, రేసు గాడిద ఏందిరా బాబు ?

న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన పోలీసులు గాడిద గురించి వివరించారు. ఈ గాడిద పేకాట ఆడుతూ పట్టుబడిన గులామ్ ముస్తఫా అనే వ్యక్తిది అని పోలీసులు కోర్టులో చెప్పారు. ఈ గాడిద 30 సెకన్లకు 600 మీటర్లు పరిగెడుతుందని దాని యజమాని గులామ్ ముస్తఫా పేకాటలో పందెంకాశారని, దానిని అడ్డం పెట్టుకుని గ్యాంబ్లింగ్ జరగడంతో దానిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.

  పాక్ క్రికెటర్ Shahid Afridi Tested Coronavirus పాజిటివ్!
   గాడిద ఖర్చు ఎంతంటే ?

  గాడిద ఖర్చు ఎంతంటే ?

  అంతే కాకుండా నాలుగు రోజుల పాటు ఆ గాడిదను పోషించడానికి అయిన ఖర్చును పేకాటరాయుళ్ల దగ్గర వసూలు చేసి మాకు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో న్యాయమూర్తి షాక్ కు గురైనారు. పోలీసుల సమాధానంతో షాక్ కు గురైన న్యాయమూర్తి 8 మంది పేకాటరాయుళ్లతో పాటు గాడిదకు బెయిల్ మంజూరు చేశారు. కేసు విచారణ పూర్తి అయ్యే వరకు గాడిదను సురక్షింతా ఉంచాలని దాని యజమాని గులామ్ ముస్తఫాకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద పాకిస్థాన్ పోలీసులు పేకాట కేసులో గాడిదను అరెస్టు చెయ్యడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

  English summary
  Super police A donkey that was arrested on the charges of illegal gambling last week in Rahim Yar Khan city in Punjab province of Pakistan was granted bail Saturday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X