వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మా స్వరాజ్ పై.. ట్రంప్ కుమార్తె ప్రశంసల జల్లు

భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి వీరిరువురూ హాజరైన సందర్భంగా స

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ట్రంప్ కు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంకాతో సుష్మా న్యూయార్క్ లో భేటీ అయ్యారు.

ఉత్తర కొరియాకు పాక్ సహకారం.. ఆ సంబంధాలపై నిగ్గుతేల్చండి, అమెరికాలో సుష్మా సంచలన వ్యాఖ్యలు ఉత్తర కొరియాకు పాక్ సహకారం.. ఆ సంబంధాలపై నిగ్గుతేల్చండి, అమెరికాలో సుష్మా సంచలన వ్యాఖ్యలు

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి వీరిరువురూ హాజరైన సందర్భంగా సుష్మాను ఇవాంకా కలిశారు. వీరిరువురూ ఉమెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ తో పాటు ఇరు దేశాల్లో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు.

భేటీ అనంతరం సుష్మాపై ఇవాంకా ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. భారత దేశానికి చెందిన, ఛరిష్మా కలిగిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలుసుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు.

ఉమెన్స్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్, త్వరలో జరగనున్న జీఈఎస్ 2017, అమెరికా, భారత్ లలో వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ గురించి తమ మధ్య గొప్ప చర్చ జరిగిందని ఆమె తెలిపారు.

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భూటాన్ ప్రధాని త్స్షేరింగ్ టోబ్గేతో కూడా సమావేశమయ్యారు. డోక్లామ్ నుంచి భరత, చైనా దళాలు పరస్పర ఉపసహరణ జరిగిన మూడు వారాలకు ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇక బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సుష్మా సమావేశం కేవలం మర్యాదపూర్వకమేనని, ఈ సమావేశంలో రోహింగ్యా ముస్లింల సమస్య చర్చకు రాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

English summary
Sushma Swaraj, the external affairs minister, held meetings with Ivanka Trump, the advisor and daughter of US president Donald Trump,and the prime ministers of Bhutan and Bangladesh on the sidelines of the UN General Assembly meeting on Tuesday. Ivanka Trump, who will lead the American delegation to November’s Global Entrepreneurship Summit in Hyderabad, wrote in a tweet that she and Swaraj discussed women’s entrepreneurship and workforce development in their countries. In another tweet, Trump described Swaraj as “accomplished and charismatic”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X