వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐఎస్ ను అంతం చేద్దాం రండి: సుష్మాస్వరాజ్

|
Google Oneindia TeluguNews

జకర్తా: ప్రపంచ దేశాలకు సవాలు చేస్తు నాగరికతనే నాశనం చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల(ఐఎస్ఐఎస్)ను అంతం చెయ్యడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మనవి చేశారు.

బుధవారం ఆమె ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరుగుతున్న ఆసియా- ఆఫ్రికా దేశాల సదస్సు-2015లో ప్రసగించారు. ఐఎస్ఐఎస్ మహమ్మారిగా తయారైయ్యిందని దానిని శాశ్వతంగా నామరూపాలు లేకుండ చెయ్యాల్సిన అవసరం వచ్చిందని అన్నారు.

Sushma Swaraj

అందుకు ఆసియా, ఆఫ్రికా దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలునిచ్చారు. మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు వారి కార్యకలాపాలకు స్వస్తి చెబుతారని, లేదంటే ఇదే విధంగా వ్యవహరిస్తారని అన్నారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల వారు దారుణంగా వ్యవహరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో మహిళలు, పిల్లలు, అమాయకుల పట్ల వారు గతంలో వ్యవహరించిన తీరుని సభలో ప్రస్తావించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కాలికి గాయం కావడంతో ఆమె కూర్చుని ప్రసంగించారు.

English summary
Today as one of the fastest growing economies in Asia, India is attaching the utmost importance to its economic engagement with the countries in these two continents," she said while speaking at the Asian African Summit 2015
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X