వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యతో గొడవ.. హైజాకర్ చేతిలో బొమ్మ తుపాకి: విమానం హైజాకింగ్ కేసులో ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

ఢాకా: బంగ్లాదేశ్‌లో బిమాన్ ఎయిర్ లైన్‌కు చెందిన బీజీ 147 విమానాన్ని ఓ వ్యక్తి హైజాక్ చేసే ప్రయత్నం చేయగా, బంగ్లాదేశ్ ప్రత్యేక దళాలు అతనిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అసలు అతను భార్యతో గొడవ కారణంగా ఇలా చేశాడు. అంతేకాదు, అతని చేతిలో ఉన్నది బొమ్మ పిస్టల్ అని విచారణలో తేలిందట.

హైజాకర్ చేతిలో బొమ్ము తుపాకీ

హైజాకర్ చేతిలో బొమ్ము తుపాకీ

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోమవారం బంగ్లాదేశ్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. సదరు వ్యక్తి వద్ద ఉన్నది కేవలం బొమ్మ తుపాకీ మాత్రమేనని, అంతేకాకుండా అతని వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు కూడా లేవని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారని తెలుస్తోంది. అతని వయస్సు 25 ఏళ్లు ఉంటుందని చెప్పారు. బంగ్లాదేశ్ ప్రత్యేక దళాల కాల్పుల్లో అతను గాయపడ్డాడు. అనంతరం గాయాల కారణంగా చనిపోయాడు.

భార్యతో వివాదం

భార్యతో వివాదం

తన భార్యతో గొడవ కారణంగానే అతను ఇలా ప్రవర్తించాడని తెలిపారు. భార్యతో గొడవ కారణంగా అతను ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడాలని భావించాడని, అందుకే బొమ్ము తుపాకీతో హైజాక్ నాటకం ఆడినట్లుగా పోలీసులు గుర్తించారట. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. అంతర్జాతీయస్థాయిలో భద్రత కలిగిన ఈ విమానాశ్రయంలో సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించడం దాదాపు సాధ్యం కాదన్నారు. అతను రెండుసార్లు ఆ తుపాకీని పేల్చినట్లుగా కొందరు ప్రయాణీకులు చెప్పారని, కానీ విచారణలో మాత్రం అది బొమ్మ తుపాకీ అని తేలిందని తెలుస్తోంది.

 అసలు ఏం జరిగిందంటే?

అసలు ఏం జరిగిందంటే?

బంగ్లాదేశ్‌లో ఓ వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేసినట్లుగా ఆదివారం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భద్రతా దళాల కాల్పుల్లో అతని మృతి చెందాడు. బిమాన్‌ ఎయిర్ లైన్‌కు చెందిన బీజీ 147 విమానాన్ని హైజాక్‌ చేయడానికి అతను ప్రయత్నించాడు. బంగ్లాదేశ్‌కు చెందిన ఆ విమానం ఢాకా నుంచి చిట్టగాంగ్ మీదుగా దుబాయికి బయలుదేరాల్సి ఉంది. ఢాకా నుంచి విమానం బయలుదేరిన కాసేపటికి చిట్టగాంగ్‌లోని షా అమానత్‌ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. ఈ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారని, అందుకే విమానాశ్రయంలో దిగాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. దీంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, ఇతర భద్రతా బలగాలు విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానం నుంచి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించారు. తాను ప్రధానితో మాట్లాడుతానని హైజాకర్‌గా భావించిన వ్యక్తి డిమాండ్ చేశాడు. కానీ ఆ తర్వాత అతను భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయాడు.

English summary
A Bangladeshi man who was shot dead after he tried to hijack a plane had carried a toy pistol and did not have any explosives on him, the police said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X