వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రార్థనలు చేస్తున్నా వదలలేదు: 150 మంది కాల్చివేత

|
Google Oneindia TeluguNews

నైజీరియా: మసీదులలో ప్రార్థనలు చేస్తున్న వారిని, ఇంటిలో వంట చేస్తున్న మహిళలు, ఆడుకుంటున్న పిల్లలను ఉగ్రవాదులు కాల్చి చంపిన సంఘటన ఈశాన్య నైజీరియాలో జరిగింది. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలోని మూడు మారుమూల గ్రామాలలో ముస్లీంలు చాల మంది నివాసం ఉంటున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా గురువారం రాత్రి మగాళ్లు మసీదులలో ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లారు.

Suspected Boko Haram militants killed nearly 150 people in Nigeria

ఉదయం నుండి ఉపవాసంతో ఉన్న వారికి బోజనం పెట్టడానికి మహిళలు ఇంట్లో వంటలు చేస్తున్నారు. ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు. అదే సమయంలో నైజీరియాలోని బోకో హరాం ఉగ్రవాదులు మోటారు బైక్ లలో అక్కడికి వెళ్లారు.

తరువాత వెంట తీసుకు వెళ్లిన అత్యాధునిక తుపాకులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. మసీదులు, ఇండ్లు, ఇండ్ల ముందు శవాలు కుప్పలుకుప్పలుగా పడిపోయాయి. అనేక మందికి బుల్లెట్ గాయాలైనాయి. ఉగ్రవాదుల కసి తీరడంతో అక్కడి నుండి పరారైనారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ తెలిపారు.

English summary
Suspected Boko Haram militants killed nearly 150 people in northeastern Nigerian villages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X