వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియా విమాన శకలాలు గుర్తింపు..? సముద్రంలో ఆనవాళ్లు.. ధృవీకరించని అధికారులు

|
Google Oneindia TeluguNews

ఇండోనేషియాకు చెందిన శ్రీ విజయ విమానం సముద్రంలో పడిపోయినట్టు తెలుస్తోంది. జకార్తా నుంచి 62 మంది ప్రయాణికులతో బయల్దేరిన కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ విమానం శకలాలు జకార్తా వెలుపల గల సముద్రంలో కనిపించినట్టు సహాయ చర్యలు చేపడుతున్న అధికారులు వివరించారు. పొంటియనిక్ ప్రాంతానికి బయల్దేరిన విమానం మధ్యాహ్నం 2.30 గంటలకు రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.

Recommended Video

ఇండోనేషియా: 62మందితో వెళ్తున్న విమానానికి ప్రమాదం
 Suspected Debris Of Indonesian Plane Found: Rescue Official

విమానంలో 62 మంది ఉన్నారని.. వారిలో 12 మంది విమాన సిబ్బంది అని రవాణాశాఖ మంత్రి బుడి కర్యా తెలిపారు. జకార్తా ఉత్తరాన గల సముద్రంలో ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు రేడియో సిగ్నల్ కనుగోలేమని రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి బగాస్ పురుహితో వివరించారు. అయితే విమానానికి సంబంధించి శిథిలాలు సముద్రంలో ఉన్నాయని.. అయితే అదీ శ్రీ విజయ ప్లైట్‌కు సంబంధించో కాదో ధృవీకరించాల్సి ఉందన్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు విమానం టేకాఫ్ అయిన 4 నిమిషాల తర్వాత ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తోంది. నిమిషం వ్యవధిలో 10 వేల అడుగుల ఎత్తు తగ్గిపోయిందని వివరించారు. అయితే ఇండోనేషియా మీడియా మాత్రం అనుమానాస్పద శిథిలాలకు సంబంధించి ఫోటోలను చూపిస్తున్నాయి. కానీ దానిని ధృవీకరించాల్సి ఉంది. నీటిపై కేబుల్స్, జీన్స్, లోహపు ముక్కలు తేలినట్టు గుర్తించామని భద్రతా అధికారి ఒకరు తెలిపారు. లోహపు ముక్కలు కనిపించాయని స్థానిక మత్య్సకారుడు తెలిపారు.

English summary
Indonesia's capital Jakarta on a domestic flight on Saturday and rescuers said suspected debris had been found in the sea off the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X