వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిమ్మతిరిగే షాక్: ఫేస్‌బుక్ పోస్టుకు లైక్ కొట్టినందుకు రూ.2లక్షల జరిమానా

వివక్షాపూరితంగా కామెంట్స్ చేసినందుకు జరిమానా పడ్డ సందర్భాలున్నాయి గానీ ఇలా లైక్ కొట్టినందుకు జరిమానా పడ్డ సందర్భం ఇదే తొలిసారని స్విస్ న్యాయవాదులు చెబుతున్నారు.

|
Google Oneindia TeluguNews

లండన్: సోషల్ మీడియాలో నెటిజెన్లు ఎంత జాగ్రత్తగా మసులుకుంటే అంత మంచిది. విద్వేషాలను రెచ్చగొట్టడమో లేక వివక్షాపూరిత కామెంట్స్ చేయడమో చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజాగా స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఓ వివక్షపూరిత కామెంట్‌కు లైక్ కొట్టి దెబ్బయిపోయాడు.

ఏకంగా 3.50లక్షల డాలర్ల జరిమానా బారిన పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. స్విట్జర్లాండ్ కు చెందిన ఎర్విన్ కెస్లర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో వన్యప్రాణుల హక్కులకు సంబంధించిన గ్రూపును నడిపిస్తుంటారు. దీనికి సంబంధించి పలు పోస్టులు అందులో పెడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన పెట్టిన ఓ పోస్టుకు వివక్షపూరిత కామెంట్స్ వెల్లువెత్తాయి.

Switzerland court fines man for liking posts on Facebook

వివక్షాపూరితంగా కామెంట్స్ చేసినందుకు కెస్లర్ కోర్టుకెక్కాడు. దీంతో ఆ చర్చలో వివక్షాపూరితంగా కామెంట్స్ చేసినవారిని, దాన్ని సమర్థిస్తూ లైక్స్ కొట్టినవారిని న్యాయమూర్తి తప్పుపట్టారు.ఇందుకు గాను ఓ వ్యక్తికి 2.50లక్షల డాలర్ల జరిమానా విధించారు. అలాగే అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గాను కోర్ట్నీ లవ్ కు ఏకంగా 3.50లక్షల డాలర్ల జరిమానా విధించింది కోర్టు.

వివక్షాపూరితంగా కామెంట్స్ చేసినందుకు జరిమానా పడ్డ సందర్భాలున్నాయి గానీ ఇలా లైక్ కొట్టినందుకు జరిమానా పడ్డ సందర్భం ఇదే తొలిసారని స్విస్ న్యాయవాదులు చెబుతున్నారు. సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.

English summary
Beware as even 'liking' a controversial post on Facebook can land you in trouble. In a first such case, a Switzerland court has fined a man over $4,000 just for clicking the "like" button on comments that a judge deemed defamatory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X