వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా స్విట్జర్లాండ్‌: సర్వే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా స్విట్జర్లాండ్‌ ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. మూడవ వార్షిక వరల్డ్ హాపీనెస్ నివేదిక ప్రకారం ఐస్‌ల్యాండ్, డెన్మార్క్, నార్వే, కెనడా దేశాలు ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నాయని 'సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్' (SDSN) అనే సంస్ధ తెలిపింది.

Switzerland is 'world's happiest' country in new poll

ప్రపంచ వ్యాప్తంగా 158 దేశాల్లో సంతోషం, శ్రేయస్సు స్ధాయిలను బట్టి ఈ అధ్యయనం చేశారు. ఇది ఇలా ఉంటే టోగో, బురుండి, సిరియా, బెనిన్, ర్వాండ దేశాల్లోని ప్రజలు అత్యంత అసంతృప్తితో జీవనం వెళ్లదీస్తున్నారని పేర్కొంది.

దేశ తలసరి జీడీపీ, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం, అవినీతి స్థాయి, సాంఘిక స్వతంత్రతలను ఆధారంగా ఈ సర్వేని నిర్వహించినట్లు తెలిపారు. సామాజిక శ్రేయస్సు ఎలా సాధించాలన్న దానికి ఈ నివేదిక సాక్ష్యాలను ఇస్తుందని, కేవలం డబ్బే కాకుండా, అందం, చిత్తశుద్ధి, నమ్మకం, మంచి ఆరోగ్యం కూడా సంతోషంగా జీవించడానికి కారణాలంటూ ఈ నివేదికలో పేర్కొన్నారు.

Switzerland is 'world's happiest' country in new poll

ప్రజల జీవన ప్రమాణాల ఆధారంగా వారి జీవన స్ధితి గతులను తెలిపేందుకు గాను ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో 'సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్' (SDSN) అనే సంస్ధను 2012లో ప్రారంభించారు.

English summary
Switzerland topped the third annual World Happiness index produced by the Sustainable Development Solutions Network (SDSN), an initiative under the United Nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X