• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజీనామా ఊసెత్తని ట్రంప్ .. ధిక్కరణకు చిహ్నంగా అలామో , టెక్సాస్ లలో పర్యటన

|

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. అటు డెమోక్రాట్లు, ఇటు కొందరు రిపబ్లికన్ల నుండి కూడా రాజీనామా డిమాండ్లు , ఛీత్కారాలు ఎదురవుతున్నా , సోషల్ మీడియాలో ట్రంప్ ఖాతాలను స్తంభింప చేస్తున్నా ఆయన మాత్రం వేటినీ లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకుంటూ పోతున్నారు.

వెళ్ళే ముందు మరో బాంబ్ పేల్చిన ట్రంప్ ..మార్చి 31 వరకు గ్రీన్ కార్డులు, వర్కింగ్ వీసాల జారీపై నిషేధం పొడిగింపు

 తన ధిక్కార ధోరణిని కొనసాగిస్తున్న ట్రంప్

తన ధిక్కార ధోరణిని కొనసాగిస్తున్న ట్రంప్

వైట్ హౌస్ ను ట్రంప్ వదిలి వెళ్లడానికి ముందే ఆయనను పదవి నుంచి తొలగించడం కోసం విపక్ష డెమోక్రటిక్ పార్టీ ఎత్తులు వేస్తున్నా , అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెడతారని తెలిసినా ట్రంప్ వాటిని పట్టించుకోకుండా తన ధిక్కార ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంత గందరగోళం జరుగుతున్నా రాజీనామా చేస్తానన్న ఒక్క మాట ట్రంప్ నోటినుండి రాకపోవడం గమనార్హం.

అధికారానికి దూరం అయ్యే రోజులు దగ్గర పడుతున్న కొద్దీ చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు డోనాల్డ్ ట్రంప్.

అలామో , టెక్సాస్ లలో ట్రంప్ పర్యటన

అలామో , టెక్సాస్ లలో ట్రంప్ పర్యటన

నిర్ణయాలు కూడా అదే తరహాలో తీసుకుంటున్నారు . తన నియంతృత్వ మనస్తత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోని అధ్యక్షుడు ట్రంప్ అలామో , టెక్సాస్ లలో పర్యటించనున్నట్లు గా తెలుస్తుంది. మెక్సికో నుంచి అక్రమ వలసలను నిరోధించడానికి, సరిహద్దు గోడ నిర్మాణం ఇతరత్రా చర్యలను ఈ సందర్భంగా స్థానికులకు ట్రంప్ వివరించనునట్లుగా తెలుస్తోంది. దేశం అట్టుడికి పోతున్నా ట్రంప్ వైఖరి మాత్రం మార్పు లేదు .

 చివరి నిముషంలోనూ షాకింగ్ నిర్ణయాలు

చివరి నిముషంలోనూ షాకింగ్ నిర్ణయాలు

డోనాల్డ్ ట్రంప్ పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నా , రాజీనామా చేయాలని, అసమర్థ ప్రెసిడెంట్ అంటూ పెద్ద ఎత్తున యూఎస్ లో ఆందోళనలు కొనసాగుతున్నా అవేవీ పట్టని ట్రంప్ చివరి నిమిషంలో కూడా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతుండటం ట్రంప్ వ్యవహార శైలికి అద్దం పడుతుంది. అంత కాదు రాజధానిలో రెండు వారాలపాటు ఎమర్జెన్సీ విధించాడు ట్రంప్

 యూఎస్ హింసాకాండకు ట్రంప్ కారకుడు అన్న 67% అమెరికన్లు

యూఎస్ హింసాకాండకు ట్రంప్ కారకుడు అన్న 67% అమెరికన్లు

క్యాపిటల్ పై జరిగిన దాడికి డోనాల్డ్ ట్రంప్ కారకుడని 67% అమెరికన్లు భావిస్తుండగా, అధ్యక్ష పదవి నుండి తొలగించాలని 56 శాతం మంది కోరుతున్నారని ఏ బి సి న్యూస్ ఇప్సోస్ సర్వేలో వెల్లడైంది . ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం క్యాపిటల్ భవనం పై జరిగిన దాడి విషయంలో తనదే బాధ్యత అని ట్రంప్ ఇప్పటివరకు ప్రకటించకపోవడం ఆయన వైఖరికి నిదర్శనం. ఇక అలాంటప్పుడు పరిస్థితులు ఏవైనా, ఎందరు ఆందోళనలు చేసినా ట్రంప్ రాజీనామా చేస్తారని అనుకోవడం తప్పే అవుతుంది.

English summary
US President Donald Trump is not changing his course. It doesn't matter if the Democrats, or even some Republicans, demand resignation, shout outs, or freeze Trump's accounts on social media. It is noteworthy that not a single word came out of Trump's mouth that he would resign in the midst of such chaos. Donald Trump is behaving very strangely as the days of running away from power draw near. President Trump is expected to visit Alamo, Texas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X