వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్టర్ ట్రంప్! మీకు ఆకలి అంటే తెలుసా?: చిన్నారి సూటి ప్రశ్న (వీడియో)

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు ఓ సిరియా బాలిక సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఓ ప్రశ్న వేసింది. మీరు ఎప్పుడైనా ఆకలితో ఉన్నారా అని ప్రశ్నించింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌కు ఓ సిరియా బాలిక సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఓ ప్రశ్న వేసింది. మీరు ఎప్పుడైనా ఆకలితో ఉన్నారా అని ప్రశ్నించింది.

<strong>మీ సైన్యంకు చేతకాకుంటే మా ట్రూప్స్ సిద్ధం: మెక్సికోకు ట్రంప్ వార్నింగ్</strong>మీ సైన్యంకు చేతకాకుంటే మా ట్రూప్స్ సిద్ధం: మెక్సికోకు ట్రంప్ వార్నింగ్

మిస్టర్‌ ట్రంప్‌.. మీరెప్పుడైనా ఇరవై గంటల పాటు భోజనం చేయకుండా ఉన్నారా? సిరియాలోని శరణార్థులు, చిన్నారుల గురించి ఒక్కసారి ఆలోచించాలని ఏడేళ్ల బాలిక బానా అలాబెద్‌ ప్రశ్నించింది.

సిరియాలోని అలెప్పోలో తమ జీవితం గురించి ట్వీట్ల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ బాలిక ఇప్పుడు, వీడియో ద్వారా అమెరికా అధ్యక్షుడిని ప్రశ్నించింది. శరణార్థుల దీన పరిస్థితిని ఆమె ప్రశ్న ద్వారా తెలిపింది.

donald trump

సిరియా సహా ఏడు ముస్లిం మెజార్టీ దేశాలపై వలసదారులు, శరణార్థులను అడ్డుకునేందుకు అమెరికా తాత్కాలిక నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.

<strong>ట్రంప్‌కు షాక్: ప్రపంచ చరిత్రలో తొలిసారి గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్..</strong>ట్రంప్‌కు షాక్: ప్రపంచ చరిత్రలో తొలిసారి గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్..

చెడ్డవారిని అమెరికాకు బయటే ఉంచేందుకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నామని ట్రంప్‌ చెప్పారు. దీని పైనా ఆమె సూటిగా ప్రశ్నించింది. తాను ఉగ్రవాదినా అని నిలదీసింది. అంతేకాదు, శరణార్థులను నిషేధించడం చెడ్డ విషయమని, అదే మంచిదైతే.. తన వద్ద మంచి ఆలోచన ఉందని, ఇతర దేశాలను శాంతియుతంగా మార్చాలని కోరింది.

English summary
Syria's 'Twitter girl' Bana Alabed asks Donald Trump if he's ever gone hungry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X