వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: రసాయనిక దాడి.. 58 మంది మృతి, మృతుల్లో 9 మంది చిన్నారులు

సిరియాలోని వాయువ్య ప్రాంతంలో ఉన్న ఇడ్లిబ్ లోని ఖాన్ షీఖాన్ పట్టణంలో జరిగిన రసాయనిక దాడిలో 58 మంది మృతి చెందారు. మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఇడ్లిబ్: సిరియాలో రసాయనిక దాడి జరిగింది. వాయువ్య ప్రాంతంలో ఉన్న ఇడ్లిబ్ నగరం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ రసాయనిక దాడిలో సుమారు 58 మంది మృతి చెందారు.

ఇడ్లిబ్ లోని ఖాన్ షీఖాన్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. సిరియా దళాలు లేదా రష్యా జెట్ విమానాలు ఈ రసాయనిక దాడులకు పాల్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరో 200 మంది ఈ దాడి ప్రభావానికి లోనయ్యారు.

తాము కెమికల్ వెపన్స్ వాడటం లేదని సిరియా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే 2014 నుంచి 2015 మధ్య అసద్ సేనలు కనీసం మూడుసార్లు ఇలా రసాయనిక దాడులకు పాల్పడినట్లు ది సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.

సల్ఫర్ ఏజెంట్ తో దాడి చేసి ఉంటారని, శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. మృతుల్లో 9 మంది పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు.

English summary
At least 58 people have been killed in a suspected chemical attack on a rebel-held town in north-west Syria, a war monitor has said. Syrian regime and Isis carried out chemical attacks, say UN investigators. The Syrian Observatory for Human Rights said those killed in the town of Khan Sheikhun, in the central province of Idlib, had died from the effects of some sort of gas. Dozens more suffered respiratory problems and other symptoms, the SOHR said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X