వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగ్దాది కోసం అండర్ కవర్ ఆపరేషన్: రెండు జతల అండర్ వేర్ ను దొంగిలించిన కుర్దిష్ ఏజెంట్..!

|
Google Oneindia TeluguNews

బీరట్: కరడు గట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాది కోసం అమెరికా సైన్యం నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్, పన్నిన వ్యూహాలు.. ఓ హై ఓల్టేజీ యాక్షన్ ప్యాక్డ్ స్పై థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉన్నాయి. మధుబాబు రాసిన షాడో స్పై థ్రిల్లర్ నవలలు, హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ మూవీలకు ఏ మాత్రం తగ్గని విధంగా ఈ అండర్ కవర్ ఆపరేషన్ ఏడాదిన్నర పాటు కొనసాగింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రపంచం మొత్తం గుర్తించిన అల్ బాగ్దాది చుట్టూ వల పన్నడానికి అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ దీనికి వ్యూహకర్త. దీనికి సిరియాకు చెందిన కుర్దిష్ ఏజెంట్లు పాత్రధారులుగా నిలిచారు.

హీరోగా ఆవిర్భవించిన కుర్దిష్ ఏజెంట్..

కుర్దిష్ సారథ్యాన్ని వహించిన సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్) సీనియర్ సలహాదారు పొలట్ కెన్.. ఈ అండర్ కవర్ ఆపరేషన్ కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన ట్విట్టర్ లో రాశారు. సిరియా కుర్దిష్ ఏజెంట్ ఒకరు ఈ అండర్ కవర్ ఆపరేషన్ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించాడని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాదులకు ఏ మాత్రం అనుమానం కలగని విధంగా వారి స్థావరంలో పాగా వేయగలిగాడు. బాగ్దాదికి విశ్వసించే అతని అనుచరులతో స్నేహం చేయగలిగాడు. సిరియాకు చెందిన వాడే కావడంతో.. రూపు రేఖలు, భాషలో ఏ మాత్రం తేడా కనిపించలేదు. దీనితో అతను ఇట్టే ఉగ్రవాదులతో కలిసిపోయాడు. తనపై నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి పొలట్ కెన్.. కొన్ని ఘాతుకాలను చేయడానికి వెనుకాడలేదని తెలిపారు.

సీఐఏతో కలిసి ఉమ్మడిగా

ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి తాము అండర్ కవర్ ఆపరేషన్ ను చేపట్టినట్లు పొలట్ కెన్ వివరించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తమను సంప్రదించిన తరువాత.. తాము ఈ ఆపరేషన్ ను నిర్వహించినట్లు వెల్లడించారు. మెరికల్లాంటి ఏజెంట్లను దీనికోసం ఉపయోగించామని, వారిలో ఒకరిని అత్యంత చాకచక్యంగా బాగ్దాది స్థావరంలోకి పంపించగలిగినట్లు చెప్పుకొచ్చారు. అయిదు నెలల పాటు ఆ ఏజెంట్ బాగ్దాదితో కలిసి పని చేశాడు. అతని నమ్మకాన్ని సాధించాడు. ఫలితంగా- బాగ్దాదితో సన్నిహితంగా మెలిగే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

అండర్ వేర్ తోనే డీఎన్ఏ

అమెరికా దాడులకు సిద్ధపడటానికి కొన్ని రోజుల ముందు..బాగ్దాదికి చెందిన రెండు జతల డ్రాయర్లను దొంగిలించాడు. అనంతరం మాయం అయ్యాడు. బాగ్దాదిని అంతమొందించడానికి సిరియాలోని ఇడ్లిస్ ప్రావిన్స్ లో గల అతని స్థావరానికి తమ వెంట అతని అండర్ వేర్ లను సైతం తీసుకెళ్లారు అమెరికా సైనికులు. బాగ్దాది మృతదేహాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వారు వాటిని తమ వెంట తీసుకెళ్లారు. చివరికి- వాటితోనే బాగ్దాది మృతదేహాన్ని ధృవీకరించగలిగారని పొలట్ కెన్ వివరించారు. అతను మరణించిన విషయాన్ని ముందుగా పెంటగాన్ కు తెలియజేసినట్లు చెప్పారు.

తరచూ నివాసాలు మార్చేవాడట..

సీఐఏతో కలిసి తాము అండర్ కవర్ ఆపరేషన్ ను చేపట్టిన తరువాత బాగ్దాదికి సంబంధించిన ప్రతి కదలికలను క్షున్నంగా అధ్యయనం చేస్తూ వచ్చామని పొలట్ వెల్లడించారు. తరచూ అతను స్థావరాలనే మార్చేవాడని, ఒక స్థావరంలో వారంరోజుల పాటు ఉండే వాడు కాదని తేలిందని అన్నారు. ఇడ్లిబ్ ప్రావిన్స్ లోని బారిషా గ్రామంలోని స్థావరానికి చేరుకున్న రెండు రోజుల్లోనే తమ వ్యూహాలను అమలు చేశామని చెప్పారు. బాగ్దాది ఎక్కడ? ఎలా? ఎన్నిరోజులు ఉంటాడనే విషయాన్ని సేకరించడానికి అయిదుమంది ఇంటెలిజెన్స్ ఏజెంట్లను నియమించామని, వారిద్వారా పక్కా సమాచారాన్ని సేకరించామని చెప్పారు.

English summary
A Syrian Kurd undercover agent took a pair of Abu Bakr al-Baghdadi’s underwear for DNA identification ahead of the US raid that killed the jihadist leader, a Kurdish official said on Monday. Polat Can, a senior adviser to the Kurdish-led Syrian Democratic Forces (SDF), published details of the intelligence work that led to the US raid in which the founder of the Islamic State group was killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X